Home » Current Affairs » Daily Current Affairs in Telugu 25th February 2026 MCQ Quiz in Telugu | డెయిలీ కరెంట్ అఫ్ఫైర్స్

Daily Current Affairs in Telugu 25th February 2026 MCQ Quiz in Telugu | డెయిలీ కరెంట్ అఫ్ఫైర్స్

On: బుధవారం, ఫిబ్రవరి 25, 2026 8:41 సా.
25th February 2026 Current Affairs Quiz

Daily Current Affairs in Telugu 25th February 2026 MCQ Quiz in Telugu డెయిలీ కరెంట్ అఫ్ఫైర్స్,latest current affairs quiz free practice test.

ఈ పోస్ట్ లో మీరు ఫ్రీ గా టెస్ట్ చేసుకోవచ్చు మీరు ఎంత వరకు నేర్చుకున్నారు పోస్ట్ చివరిలో మీకు ఈ రోజు క్విజ్ ఉంటది.

Attempt 25th February 2026 Daily Current Affairs Quiz in Telugu with important MCQs and answers. Best practice test for SSC, RRB, APPSC, TSPSC & competitive exams.

Daily Current Affairs in Telugu 25th February 2026 MCQ

Try Todays Current Affairs Quiz Test

1.గాలి నుండి స్వచ్ఛమైన నీటిని వెలికితీసే అధునాతన యంత్రాన్ని ఎవరు అభివృద్ధి చేశారు?

A) వాల్టర్ సి. విల్లెట్
B) ఒమర్ యాఘి
C) డాక్టర్ చంద్ర శేఖర్ శర్మ
D) సిఎన్ఆర్ రావు

జవాబు:

(బి) ఒమర్ యాఘి
నోబెల్ గ్రహీత ఓమర్ యాఘీ గాలిలోని తేమ నుండి రోజుకు కనీసం 1000 లీటర్ల స్వచ్ఛమైన నీటిని సేకరించే అత్యాధునిక యంత్రాన్ని అభివృద్ధి చేశారు. ఈ యంత్రం ‘మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్’ (మాలిక్యులర్ స్పాంజీలు) సాంకేతికతను ఉపయోగిస్తుంది మరియు సూర్యరశ్మి సహాయంతో పనిచేస్తుంది. విద్యుత్ అవసరం లేని ఈ పరికరం, తేమ 20 శాతం కంటే తక్కువగా ఉన్న ఎడారి ప్రాంతాలలో కూడా నీటిని సేకరించగలదు.

2.ఐఐటీ-కాన్పూర్ పరిశోధకులు దేని పరిశీలన కోసం డేటా ఆధారిత 3D నమూనాను రూపొందించారు?

A) భూ వాతావరణం
B) సూర్యగోళంలో సంభవిస్తున్న పరిణామాలు
C) ఇతర గ్రహాల కదలికలు
D) చంద్రుని ఉపరితలం

సమాధానం

(బి). సూర్యగోళంలో సంభవిస్తున్న పరిణామాలు
ఐఐటీ-కాన్పూర్ పరిశోధకులు సూర్యునిపై నిరంతర నిఘాకు త్రీడీ నమూనా రూపొందించారు, సూర్యగోళంలో సంభవిస్తున్న పరిణామాల పరిశీలన కోసం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డేటా ఆధారిత త్రీడీ నమూనాను రూపొందించారు.

3.పోఖ్రాన్లో సైన్యం నిర్వహించిన భారీ విన్యాసాల పేరు ఏమిటి?

A) వరుణ శక్తి
B) అగ్ని వర్ష
C) సదరన్ కమాండ్
D) ఆపరేషన్ విజయ్

సమాధానం:

(బి) అగ్ని వర్ష
వివరణ: రాజస్థాన్లోని పోఖ్రాన్ ఎడారుల్లో సైన్యం మంగళవారం ‘అగ్ని వర్ష’ పేరుతో భారీ విన్యాసాలు నిర్వహించింది. ఈ విన్యాసాల్లో మానవరహిత గగనతల వాహనాలు, డ్రోన్ నిరోధక వ్యవస్థలు, ఆధునిక ఆర్టిల్లరీ ప్లాట్ఫాంలు, నిఘా వ్యవస్థలను ఎక్కువగా ప్రదర్శించారు.

4.కేరళ రాష్ట్రం తన పేరును ఏ విధంగా మార్చాలని కేంద్రాన్ని కోరింది?

A) కేరళం
B) కేరళనాడు
C) కేరళ దేశం
D) కేరళ భూమి

సమాధానం:

(a) కేరళం
వివరణ: కేరళ అసెంబ్లీ తన పేరును అధికారికంగా ‘కేరళం’గా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ ఇప్పటికే పలుమార్లు తీర్మానాలు చేసింది.

5.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన ఢిల్లీ-మీరట్ ‘నమో భారత్’ RRTS కారిడార్ మొత్తం పొడవు ఎంత?

A) 50 కి.మీ
B) 82 కి.మీ
C) 100 కి.మీ
D) 75 కి.మీ

సమాధానం:

B) 82 కి.మీ వివరణ: ప్రధాని మోదీ 82 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-మీరట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) కారిడార్‌ను పూర్తిస్థాయిలో ప్రారంభించారు.

6.2026 ‘నేషనల్ ఆరోగ్య మేళా’ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్కడ ప్రారంభించారు?

A) ముంబై
B) నాగ్ పూర్
C) షేగావ్ (మహారాష్ట్ర)
D) పూణే

సమాధానం:

C) షేగావ్ (మహారాష్ట్ర) వివరణ: ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా షేగావ్‌లో ఫిబ్రవరి 25 నుండి 28 వరకు ఈ మేళా జరుగుతుంది

7.నేషనల్ హైవేల నిర్మాణ నాణ్యతను తనిఖీ చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన మొబైల్ ల్యాబ్‌ల పేరు ఏమిటి?

A) హైవే చెక్
B) రోడ్ క్వాలిటీ వ్యాన్స్
C) మొబైల్ క్వాలిటీ కంట్రోల్ వ్యాన్స్
D) సేఫ్ రోడ్ ల్యాబ్స్

సమాధానం:

C) మొబైల్ క్వాలిటీ కంట్రోల్ వ్యాన్స్ వివరణ: రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పెంచడానికి ఆన్-సైట్ టెస్టింగ్ కోసం వీటిని ప్రారంభించారు.

8.భారతదేశంలో నక్సల్స్ నిర్మించిన స్మారక చిహ్నాలను తొలగించడానికి భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి?

A) ఆపరేషన్ క్లీన్
B) ఆపరేషన్ డిమోలిష్‌మెంట్
C) ఆపరేషన్ శక్తి
D) ఆపరేషన్ ముక్తి

సమాధానం:

B) ఆపరేషన్ డిమోలిష్‌మెంట్ వివరణ: నక్సలైట్ల సిద్ధాంతపరమైన ప్రభావాన్ని తగ్గించడానికి మహారాష్ట్ర మరియు ఛత్తీస్‌గఢ్‌లలో వారి స్మారక చిహ్నాలను కూల్చివేస్తున్నారు.

9.నాలుగవ ఎడిషన్ ‘వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ 2026’కు ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రం ఏది?

A) కేరళ
B) తమిళనాడు
C) గోవా
D) మహారాష్ట్ర

సమాధానం:

C) గోవా వివరణ: ఫిబ్రవరి 23 నుండి 26 వరకు గోవాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.

10.ఇజ్రాయెల్ పార్లమెంటు అయిన ‘నెస్సెట్’ (Knesset) ను ఉద్దేశించి ప్రసంగించనున్న మొదటి భారత ప్రధాని ఎవరు?

A) జవహర్ లాల్ నెహ్రూ
B) అటల్ బిహారీ వాజ్‌పేయి
C) నరేంద్ర మోదీ
D) మన్మోహన్ సింగ్

సమాధానం:

C) నరేంద్ర మోదీ వివరణ: ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా అక్కడి పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించి చరిత్ర సృష్టించనున్నారు.

11.ఇటీవల వార్తల్లో నిలిచిన ‘వూన్ ఐలాండ్’ (Vun Island) ఎక్కడ ఉంది?

A) గల్ఫ్ ఆఫ్ మన్నార్
B) అండమాన్ నికోబార్
C) లక్షద్వీప్
D) ప్యాక్ స్ట్రెయిట్

సమాధానం:

A) గల్ఫ్ ఆఫ్ మన్నార్ వివరణ: తమిళనాడు తీరంలోని ఈ ద్వీపంలో కృత్రిమ రీఫ్ ప్రాజెక్ట్ వల్ల పర్యావరణ ప్రయోజనాలు పెరిగినట్లు అధ్యయనంలో తేలింది.

12.’గ్లోబల్ AI బ్రెయిన్ రేస్ రిపోర్ట్ 2026′ ప్రకారం భారతదేశం ఏ ర్యాంకులో నిలిచింది?

A) 1వ
B) 3వ
C) 6వ
D) 10వ

సమాధానం:

C) 6వ వివరణ: AI ఆవిష్కరణలలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా, భారత్ 6వ స్థానంలో నిలిచింది

13.ఆస్ట్రేలియా భూభాగంలో H5N1 (ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా) బారిన పడినట్లు గుర్తించిన మొదటి పక్షి జాతి ఏది?

A) జెంటూ పెంగ్విన్
B) కింగ్ పెంగ్విన్
C) ఆల్బాట్రాస్
D) ఈము

సమాధానం:

A) జెంటూ పెంగ్విన్ వివరణ: అంటార్కిటిక్ సమీపంలోని ఆస్ట్రేలియా హర్డ్ ఐలాండ్‌లో ఈ పెంగ్విన్‌కు వైరస్ సోకినట్లు గుర్తించారు.

14.భారత్ ఏ దేశంతో తన పాత పన్ను ఒప్పందాన్ని (DTAA) సవరించి ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ (MFN) హోదాను

తొలగించింది?
A) అమెరికా
B) జర్మనీ
C) ఫ్రాన్స్
D) రష్యా

సమాధానం:

C) ఫ్రాన్స్ వివరణ: 1992 నాటి పన్ను ఒప్పందాన్ని సవరిస్తూ భారత్ మరియు ఫ్రాన్స్ ఈ నిర్ణయం తీసుకున్నాయి.

15.నీతి ఆయోగ్ కొత్త CEO గా ఎవరు నియమితులయ్యారు?

A) బివిఆర్ సుబ్రహ్మణ్యం
B) నిధి చిబ్బర్
C) పి. అముధ
D) సుదీప్ జైన్

సమాధానం:

(బి) నిధి చిబ్బర్
వివరణ: సీనియర్ ఐఏఎస్ అధికారిణి నిధి చిబ్బర్ నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమితులయ్యారని వార్తా కథనం స్పష్టంగా పేర్కొంది.

16.’సయ్యద్ 3G’ (Sayyad 3G) అనే ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది?

A) ఇస్రాయెల్
B) రష్యా
C) ఇరాన్
D) ఉత్తర కొరియా

సమాధానం:

C) ఇరాన్ వివరణ: ఇరాన్ తన నావికాదళం కోసం అత్యాధునిక ‘సయ్యద్ 3G’ ఎయిర్ డిఫెన్స్ మిసైల్‌ను పరీక్షించింది.

17.’నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ ఆఫ్ రైస్’ (Grain of Heritage) కు ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రం ఏది?

A) అస్సాం
B) మేఘాలయ
C) నాగాలాండ్
D) మణిపూర్

సమాధానం:

C) నాగాలాండ్ వివరణ: సంప్రదాయ వరి వంగడాలను ప్రోత్సహించడానికి నాగాలాండ్‌లో ఈ రెండు రోజుల పండుగ జరుగుతుంది.

18.ఇటీవల NGT ఉత్తర్వుల ప్రకారం, ‘సువౌ నది’ (Suwau River) ఏ నదికి ఉపనది?

A) గంగా
B) రాప్తినీ
C) యమునా
D) గోమతి

సమాధానం:

B) రాప్తినీ వివరణ: ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లాలో ఉన్న ఈ నదిని ‘నాలా’ నుండి ‘నది’గా రికార్డుల్లో మార్చాలని NGT ఆదేశించింది.

19.’నేషనల్ దివ్యాంగ్‌జన్ క్రికెట్ స్పోర్ట్స్ ఫెస్టివల్ 2026′ ఎక్కడ ప్రారంభమైంది?

A) ఇండోర్
B) భోపాల్
C) గ్వాలియర్
D) జబల్ పూర్

సమాధానం: B) భోపాల్ వివరణ: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భోపాల్‌లో ఈ క్రీడలను ప్రారంభించారు. దీని థీమ్ “Not Out at 100”.

20.భారత్, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి?

A) పోఖ్రాన్, రాజస్థాన్
B) దిల్లీ
C) హిమాచల్లోని బక్లోహ్
D) ముంబై

సమాధానం:

(సి) హిమాచల్లోని బక్లోహ్
వివరణ: హిమాచల్లోని బక్లోహ్లో భారత్, అమెరికా సైన్యాలు 16వ విడత సంయుక్త మిలిటరీ విన్యాసాలను మంగళవారం ప్రారంభించాయి. పర్వతాలతో కూడిన ప్రాంతాల్లో సంయుక్త బలగాల ఆపరేషన్లను చేపట్టే సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడంపై ఇందులో దృష్టిపెట్టనున్నట్లు సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది.

25th February Current Affairs Test

25th February 2026 Current Affairs Quiz

Latest Test Series

Today Current Affairs START TEST
Previous Papers Previous papers
Geography Geography
Biography Biography
Awards & Honors Awards
History History


Discover more from SRMTUTORS

Subscribe to get the latest posts sent to your email.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now