70th National Film Awards 2024

0
70th National Film Awards 2024

70th National Film Awards: 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను శుక్రవారం న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్ లో ప్రకటించారు. త్వరలో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో వివిధ భాషలకు చెందిన ఉత్తమ చిత్రాలను రాష్ట్రపతి సన్మానించనున్నారు.

జనవరి 1, 2022 నుంచి డిసెంబర్ 31, 2022 మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) సర్టిఫై చేసిన చిత్రాలను ఈ అవార్డులు గుర్తిస్తాయి. ఫీచర్ ఫిల్మ్స్ కు చైర్ పర్సన్ రాహుల్ రవైల్, నాన్ ఫీచర్ ఫిల్మ్స్ కు నీలా మాధబ్ పాండా, సినిమాలో ఉత్తమ రచనగా గంగాధర్ ముదలైర్ నేతృత్వంలో ఈ ఏడాది జ్యూరీ అసాధారణ ప్రతిభను, సినిమా విజయాలను ఎత్తిచూపింది.

పలు భాషల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో సన్మానించిన జాతీయ అవార్డుల విజేతలందరికీ ఫిల్మ్ ఫేర్ అభినందనలు తెలిపింది.

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను (70th National Film Awards) కేంద్రం ప్రకటించింది. ఉత్తమ చిత్రం అవార్డు మలయాళ సినిమా ‘ఆట్టమ్‌’ (Aattam)ను వరించగా.. ఉత్తమ నటుడి పురస్కారం ‘కాంతార’ సినిమాకుగాను రిషబ్‌ శెట్టికి దక్కింది. ఉత్తమ నటి పురస్కారానికి నిత్య మేనన్‌ (తిరుచిట్రంబళం), మానసి పరేఖ్‌ (కచ్‌ ఎక్స్‌ప్రెస్‌)ను జ్యూరీ సంయుక్తంగా ఎంపిక చేసింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకుగానూ ఈ అవార్డులను ప్రకటించారు.

70th National Film Awards 2024

ఫీచర్‌ సినిమాలు

ఉత్తమ చిత్రం: ఆట్టమ్‌ (మలయాళం)

ఉత్తమ నటుడు: రిషబ్‌ శెట్టి (కాంతార – కన్నడ)

ఉత్తమ నటి: నిత్య మేనన్‌ (తిరుచిట్రంబళం – తమిళం), మానసి పరేఖ్‌ (కచ్‌ ఎక్స్‌ప్రెస్‌ – గుజరాతీ)

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు): కార్తికేయ 2

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (కన్నడ): కేజీయఫ్‌ 2

ఉత్తమ  ప్రాంతీయ చిత్రం (తమిళం): పొన్నియిన్‌ సెల్వన్‌ – 1

ఉత్తమ దర్శకుడు: సూరజ్‌ బర్జాత్యా (ఉంచాయి – హిందీ)

బెస్ట్‌ ఫిల్మ్‌ ప్రమోటింగ్‌ నేషన్‌, సోషల్‌, ఎన్విరాన్‌మెంటల్‌ వాల్యూస్‌: కచ్‌ ఎక్స్‌ప్రెస్‌ (గుజరాతీ)

ఉత్తమ హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్మెంట్‌: కాంతార (కన్నడ)

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: బ్రహ్మాస్త్ర – పార్ట్‌ 1: శివ (హిందీ)

ఉత్తమ దర్శకుడు (డెబ్యూ): ప్రమోద్‌ కుమార్‌, ఫౌజా (హరియాన్వీ)

ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)

ఉత్తమ సహాయ నటుడు: పవన్‌ రాజ్‌ మల్హోత్రా (ఫౌజా – హరియాన్వి)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: పొన్నియిన్‌ సెల్వన్‌: పార్ట్‌ – 1 (తమిళం), సినిమాటోగ్రాఫర్‌: రవి వర్మన్‌

బెస్ట్‌ ఫిమేల్ ప్లే బ్యాక్‌ సింగర్‌ : బాంబే జయశ్రీ (చాయుమ్‌ వెయిల్‌), సినిమా: ‘సౌదీ వెల్లక్క సీసీ 225/2009’

ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌ : అర్జిత్‌ సింగ్‌ (కేసరియా) – బ్రహ్మాస్త్ర పార్ట్‌ 1: శివ (హిందీ)

ఉత్తమ బాల నటుడు: శ్రీపాథ్‌ (మలికాపురమ్‌ – మలయాళం)

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: నిక్కి జోషి (కచ్‌ ఎక్స్‌ప్రెస్‌ – గుజరాతీ)

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ : ఆనంద అద్య (అపరాజితో)

ఉత్తమ ఎడిటింగ్‌: ఆట్టమ్‌, ఎడిటర్‌: మహేష్‌ భువనేండ్‌

ఉత్తమ సౌండ్‌ డిజైన్‌: పొన్నియిన్‌ సెల్వన్‌ – 1 (తమిళం), డిజైనర్‌: ఆనంద్‌ కృష్ణమూర్తి

ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌): ఆట్టం – ఆనంద్‌ ఏకార్షి

ఉత్తమ మాటల రచయిత: అర్పితా ముఖర్జీ, రాహుల్‌ వి చిట్టెల (గుల్‌మోహర్‌)

ఉత్తమ యాక్షన్‌ డైరక్షన్‌: అన్బరివు (కేజీయఫ్‌ 2)

ఉత్తమ కొరియోగ్రఫీ: జానీ మాస్టర్‌, సతీష్‌ కృష్ణన్‌ మాస్టర్‌ (తిరుచిట్రంబళం – తమిళ్‌)

ఉత్తమ లిరిక్స్‌: ఫౌజా (హరియాన్వీ), రచయిత: నౌషద్‌ సదర్‌ ఖాన్‌

ఉత్తమ సంగీతం (పాటలు): బ్రహ్మస్త్ర- పార్ట్‌ 1: శివ (హిందీ) – ప్రీతమ్‌

ఉత్తమ సంగీతం (నేపథ్యం): పొన్నియిన్‌ సెల్వన్‌ – 1 (తమిళ్‌), సంగీత దర్శకుడు: ఏఆర్‌ రెహమాన్‌

బెస్ట్‌ మేకప్‌: ఆర్టిస్ట్‌: సోమనాథ్‌ కుందు, (అపరాజితో – బెంగాళీ),

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (ఒడియా): దమన్‌

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మలయాళం): సౌది వెళ్లక్క సీసీ 225/2009

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మరాఠీ): వాల్వీ (ది టెర్మైట్‌) 

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (హిందీ) : గుల్‌మోహర్‌

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (బెంగాళీ): కబేరి అంతర్దాన్‌

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (పంజాబీ): బాగీ డి దీ

బెస్ట్‌ టివా ఫిల్మ్: సికాసిల్‌

స్పెషల్‌ మెన్షన్‌: గుల్‌మోహర్‌ (హిందీ), నటుడు: మనోజ్‌ బాజ్‌పాయ్; కదికన్‌ (మలయాళం), సంగీత దర్శకుడు: సంజోయ్‌ సలీల్‌ చౌదురి

1000 GK Bits in Telugu

నాన్‌ ఫీచర్‌ సినిమాలు

బెస్ట్‌ డాక్యుమెంటరీ: ‘మర్మర్స్‌ ఆఫ్‌ ది జంగిల్‌’ – మరాఠీ

బెస్ట్‌ ఆర్ట్స్‌ / కల్చర్‌ ఫిల్మ్‌: రంగ విభోగ (టెంపుల్‌ డ్యాన్స్‌ ట్రెడిషన్‌) – కన్నడ

బెస్ట్‌ ఆర్ట్స్‌ / కల్చర్‌ ఫిల్మ్‌: వర్ష (లెగసీ) – మరాఠీ

బెస్ట్‌ డెబ్యూ ఫిల్మ్‌ ఆఫ్‌ ఏ డైరెక్టర్‌ – మధ్యంతర (ఇంటర్‌మిషన్‌) – కన్నడ, దర్శకుడు: బస్తి దినేశ్‌ షెనోయ్‌

బెస్ట్‌ నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్: అయనా (మిర్రర్‌)

బెస్ట్‌ డైరక్షన్‌: ‘ఫ్రమ్‌ ది షాడో’ (బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్‌), దర్శకుడు: మిరియం చాండీ మినాచెరీ

బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ఉన్యుత (వాయిడ్‌) – అస్సామీ

బెస్ట్‌ యానిమేషన్‌ సినిమా: ఏ కోకోనట్‌ ట్రీ (సైలెంట్‌)

బెస్ట్‌ నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్ ప్రమోటింగ్‌ సోషల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటర్‌ వాల్యూస్‌: ‘ఆన్‌ ది బ్రింక్‌ సీజన్‌ 2 – ఘరియాల్‌) – ఇంగ్లిష్‌

బెస్ట్‌ ఎడిటింగ్‌: మధ్యంతర (ఇంటర్‌మిషన్‌) – కన్నడ, ఎడిటర్‌ (సురేశ్‌ యూఆర్‌ఎస్‌)

బెస్ట్‌  సౌండ్‌ డిజైన్‌: యాన్‌ (వెహికల్‌) – హిందీ/ మాల్వి, సౌండ్‌ డిజైనర్‌: మానస్‌ చౌధురి

బెస్ట్‌ సినిమాటోగ్రీఫీ: మోనో నో అవేర్‌ (హిందీ – ఇంగ్లీష్‌), సినిమాటోగ్రాఫర్‌: సిద్ధార్థ్‌ దివాన్‌

బెస్ట్ నెరేషన్‌ / వాయిస్‌ ఓవర్‌: మర్మర్స్‌ ఆఫ్‌ ది జంగిల్‌ (మరాఠీ), వాయిస్‌ ఓవర్‌: సుమంత్‌ శిందే

బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌: ఫుర్సత్‌ (లీజర్‌) – విశాల్‌ భరద్వాజ్‌

ఉత్తమ స్క్రిప్ట్‌: మోనో నో అవేర్‌ (హిందీ – ఇంగ్లిష్‌), రచయిత: కౌశిక్‌ సర్కార్‌

 స్పెషల్‌ మెన్షన్‌: బిరుబాలా ‘విచ్‌ టు పద్మశ్రీ (అస్సామీ), హర్గిలా – ది గ్రేటర్‌ అడ్జుటెంట్‌ స్టార్క్‌ (అస్సామీ)

బెస్ట్‌ బుక్‌ ఆన్‌ సినిమా: కిషోర్‌ కుమార్‌ (ది అల్టిమేట్‌ బయోగ్రఫీ) – ఇంగ్లిష్‌, రచయితలు: అనిరుద్ధ భట్టాచార్జీ, పార్థివ్‌ ధార్‌

ఉత్తమ క్రిటిక్‌: దీపక్‌ దుహా (హిందీ)

Dadasaheb Phalke Award 2023 DPIFFA2023 Winners List in Telugu PDF