Home » Current Affairs » April 2026 Current Affairs in Telugu PDF Download | Daily One Liners for APPSC, TGPSC, SSC

April 2026 Current Affairs in Telugu PDF Download | Daily One Liners for APPSC, TGPSC, SSC

On: శుక్రవారం, మే 1, 2026 7:55 ఉద.
April 1st 2026Current Affairs

ఏప్రిల్ 2026 నెలకు సంబంధించిన ముఖ్యమైన Current Affairs ను తెలుగు లో ఇక్కడ అందిస్తున్నాము. APPSC, TGPSC, SSC, Railway, Banking మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా రోజువారీ One-Liners, MCQs, Quiz మరియు PDF Download లింక్ ఇవ్వబడింది.

April 2026 Monthly Current Affairs One Liners PDF in Telugu – Daily updated GK bits for SSC, RRB, UPSC, APPSC & TSPSC exams.

📥 April 2026 Current Affairs PDF Download

Download

March 2026 PDF Download

April 2026 – One Liner Current Affairs

30th April 2026 Current Affairs

  • అరకు పాత విత్తనోత్సవం: గిరిజన జీవవైవిధ్యం మరియు స్వదేశీ విత్తన సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయలో నిర్వహించబడిన 17వ వార్షికోత్సవం.
  • బాస్మతీ శిక్షణా కేంద్రం: ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో సుమారు ₹15 కోట్ల వ్యయంతో బాస్మతీ మరియు ఆర్గానిక్ శిక్షణా కేంద్రాన్ని APEDA ఏర్పాటు చేస్తోంది.
  • పునర్చక్రణ ప్లాంట్: భారతదేశపు మొట్టమొదటి సమగ్ర పునర్చక్రణ ప్లాంట్ (Integrated Recycling Plant) ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభించబడింది.
  • ఓపెక్ (OPEC) నుండి నిష్క్రమణ: చమురు మార్కెట్ అస్థిరత నేపథ్యంలో మే 1, 2026 నుండి ఓపెక్ మరియు ఓపెక్ ప్లస్ కూటమి నుండి వైదొలుగుతున్న దేశం: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE).
  • యూరప్ లిథియం ప్రాజెక్ట్: యూరప్‌లోనే మొట్టమొదటి పూర్తిస్థాయి సమగ్ర ‘లిథియం ప్రాజెక్ట్’ ప్రారంభమైన దేశం: ఫిన్లాండ్ (కోకోలా నగరం సమీపంలో).
  • మిషన్ సక్షం: పట్టణ సహకార బ్యాంకుల (UCBs) సామర్థ్యాన్ని పెంపొందించడానికి సుమారు 1.40 లక్షల మందికి శిక్షణ ఇచ్చేందుకు ఆర్‌బీఐ (RBI) ప్రారంభించిన ప్రోగ్రామ్.
  • నీతి ఆయోగ్ విజన్ 2047: ‘DPI@2047’ రోడ్ మ్యాప్ ప్రకారం, 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 30 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
  • మిషన్ జాగృక్ (Jaagruk): సెబీ (SEBI) తన 38వ స్థాపక దినోత్సవం సందర్భంగా పెట్టుబడిదారుల అవగాహన కోసం ప్రారంభించిన ప్రచారం.
  • రోమన్ స్పేస్ టెలిస్కోప్: డార్క్ మేటర్ మరియు డార్క్ ఎనర్జీ రహస్యాలను పరిశోధించడానికి నాసా (NASA) అభివృద్ధి చేసిన అత్యాధునిక టెలిస్కోప్.
  • గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్: అదానీ గ్రూప్ భాగస్వామ్యంతో సుమారు $5 బిలియన్ల పెట్టుబడితో గూగుల్ క్లౌడ్ తన ఏఐ హబ్ మరియు డేటా సెంటర్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయనుంది.
  • అట్లాస్ డ్రోన్ స్వార్మ్ సిస్టమ్: ఒకేసారి 96 చిన్న డ్రోన్లను నియంత్రించగల ఏఐ ఆధారిత వ్యవస్థను చైనా ఆవిష్కరించింది.
  • ప్రగతి అభ్యాసం (Pragati Exercise): ఈ సంయుక్త సైనిక విన్యాసం యొక్క మొదటి ఎడిషన్ మేఘాలయ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది.
  • మెహర్ బాబా కాంపిటీషన్ 3: స్వదేశీ డ్రోన్ సాంకేతికతను ప్రోత్సహించడానికి భారత వైమానిక దళం (IAF) ప్రారంభించిన పోటీ.
  • తొలి ట్రాన్స్‌జెండర్ అంపైర్: భారత క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ క్రికెట్ అంపైర్‌గా గుర్తింపు పొందిన వ్యక్తి: రితికా శ్రీ (Ritika Shree).

29th April Current Affairs

  • లడఖ్ కొత్త జిల్లాలు: నుబ్రా, షామ్, చాంగ్‌థాంగ్, జంస్కర్ మరియు ద్రాస్ అనే 5 కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించింది.
  • ప్రాథమిక హక్కు: ఆర్టికల్ 21 (జీవించే హక్కు) ప్రకారం ‘సురక్షితమైన హైవే ప్రయాణం’ అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొంది.
  • స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA): ఏప్రిల్ 27, 2026న భారత్ మరియు న్యూజిలాండ్ దేశాల మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది.
  • ఆహార సంక్షోభ నివేదిక 2026: తీవ్రమైన ఆహార అభద్రత ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో నైజీరియా (3.6 కోట్ల మంది) మొదటి స్థానంలో ఉంది.
  • సిప్రీ (SIPRI) నివేదిక 2026: ప్రపంచ రక్షణ వ్యయంలో 92.1 బిలియన్ డాలర్లతో భారతదేశం 5వ స్థానంలో నిలిచింది.
  • ఆనోడ్ మెటీరియల్ ప్లాంట్: దేశంలోనే మొట్టమొదటి వాణిజ్య లిథియం-అయాన్ బ్యాటరీ ఆనోడ్ మెటీరియల్ ఉత్పత్తి కేంద్రాన్ని పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో ప్రారంభించారు.
  • మష్రూమ్ మిషన్: దేశంలోనే మొదటిసారిగా ₹13,000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మష్రూమ్ మిషన్’ను ప్రకటించింది.
  • లోక్మత్ సుర్ జ్యోత్స్న అవార్డు: 2026 సంవత్సరానికి గానూ ఈ జాతీయ సంగీత పురస్కారాన్ని సుమిత్ర గుహా మరియు పండిట్ లక్ష్మణ్ కృష్ణరావు పండిట్ గెలుచుకున్నారు.
  • యునెస్కో చైర్ (UNESCO Chair): జెండర్ ఇన్‌క్లూజన్‌పై ఆసియాలోనే మొదటి యునెస్కో చైర్‌ను పూణేలోని సింబయాసిస్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ప్రారంభించింది.
  • లండన్ మ్యారథాన్ 2026: కెన్యాకు చెందిన సెబాస్టియన్ సావే అధికారిక రేసులో 2 గంటల లోపు (1:59:30) మ్యారథాన్ పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు.
  • ఐపీఎల్ రికార్డ్: ఐపీఎల్ చరిత్రలో 9000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి మరియు ఏకైక బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డుకెక్కారు.
  • ప్రపంచ పని ప్రదేశ భద్రత దినోత్సవం: ప్రతి ఏటా ఏప్రిల్ 28న అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

Quiz Time: 29th April

April 28th one-liners

  • ఢిల్లీ మెట్రో ఇంటర్నేషనల్ (DMIC): విదేశీ ప్రాజెక్టుల కోసం ఏర్పాటు చేసిన ఈ సంస్థకు మొదటి సీఈఓగా నియమితులైన వారు: సంజయ్ జమ్వార్.
  • BWF కౌన్సిల్ మెంబర్: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (BWF) కౌన్సిల్‌లో పూర్తిస్థాయి ఓటింగ్ సభ్యత్వం పొందిన భారత షట్లర్: పి.వి. సింధు.
  • ఆంధ్ర యూనివర్సిటీ పురస్కారం: ఏయూ శతాబ్ది వేడుకల్లో ‘విశిష్ట పూర్వ విద్యార్థి పురస్కారం’ అందుకున్న సైయంట్ చైర్మన్: డాక్టర్ బి.వి.ఆర్. మోహన్ రెడ్డి.
  • స్మైల్ బెగ్గర్ సర్వే యాప్: భిక్షాటన చేసే వారి డేటాను సేకరించడానికి చండీగఢ్‌లో ప్రారంభమైన ఈ యాప్ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది.
  • నశా ముక్త్ భారత్ అభియాన్ 2.0: మాదకద్రవ్యాల నివారణ కోసం కేంద్రం చేపట్టిన ఈ మిషన్ నిర్వహణ సంస్థ: సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ.
  • బుల్లెట్ రైలు ప్లాంట్: ‘ఆదిత్య’ (B28) స్వదేశీ బుల్లెట్ రైళ్ల తయారీ కోసం బెంగళూరులో BEML ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి: అశ్విని వైష్ణవ్.
  • విక్రమ్-1 రాకెట్: భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ను అభివృద్ధి చేసిన సంస్థ: స్కైరూట్ ఏరోస్పేస్ (హైదరాబాద్).
  • ISSF జూనియర్ వరల్డ్ కప్: కైరో (ఈజిప్ట్)లో జరిగిన ఈ టోర్నీలో 16 పతకాలతో (5 స్వర్ణాలు) పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం: భారతదేశం.
  • సూరజ్యోత్స్న నేషనల్ మ్యూజిక్ అవార్డ్ 2026: ఈ పురస్కారాన్ని గెలుచుకున్న శాస్త్రీయ సంగీత విద్వాంసులు: సుమిత్ర గుహా మరియు పండిట్ లక్ష్మణ్ కృష్ణరావు పండిట్.
  • ప్రపంచ పని సురక్షిత దినోత్సవం: పని ప్రదేశాలలో భద్రత మరియు ఆరోగ్యంపై అవగాహన కోసం దీనిని నిర్వహిస్తారు.
  • అంతర్జాతీయ కార్మికుల సంస్మరణ దినోత్సవం: వృత్తిపరమైన ప్రమాదాల్లో మరణించిన లేదా గాయపడిన కార్మికులను స్మరిస్తూ ఈ రోజును పాటిస్తారు.

Practice Quiz 28th April

27th April oneliner bits

  • ఇస్రో (ISRO) ల్యాండ్ మ్యాపింగ్: గ్రామ పంచాయతీలలో డేటా ఆధారిత ప్రణాళికల కోసం ఇస్రో హై-రిజల్యూషన్ ల్యాండ్ మ్యాపింగ్ ప్రాజెక్టును పూర్తి చేసింది.
  • సెన్సస్ 2027 హెల్ప్‌లైన్: రాబోయే జనాభా గణన సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన టోల్ ఫ్రీ నంబర్: 1855.
  • పునరుత్పత్తి స్వయంప్రతిపత్తి (Reproductive Autonomy): 15 ఏళ్ల బాలిక గర్భాన్ని తొలగించడానికి అనుమతిస్తూ, ఈ హక్కును ఆర్టికల్ 21లో భాగంగా సుప్రీంకోర్టు గుర్తించింది.
  • బస్రా మెమోరియల్ (Basra Memorial): మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన 33,000 మంది భారత సైనికుల పేర్లను ఇరాక్లోని ఈ స్మారక చిహ్నం వద్ద చేర్చారు.
  • ఎస్‌సీఓ (SCO) సదస్సు: 2026 ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశం కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్లో నిర్వహించబడింది.
  • కరెన్సీ స్వాప్: మాల్దీవుల ఆర్థిక స్థిరత్వం కోసం ఆర్‌బీఐ 30 బిలియన్ రూపాయల కరెన్సీ స్వాప్ సదుపాయాన్ని ఆమోదించింది.
  • సోలార్ సెల్స్‌పై డ్యూటీ: భారతీయ సోలార్ సెల్స్ మరియు ప్యానెల్స్‌పై అమెరికా 123.04% భారీ యాంటీ-డంపింగ్ డ్యూటీని విధించింది.
  • పేటీఎం (Paytm) లైసెన్స్: నిబంధనల ఉల్లంఘన కారణంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బ్యాంకింగ్ లైసెన్స్‌ను ఆర్‌బీఐ రద్దు చేసింది.
  • మలేరియా డ్రగ్: నవజాత శిశువుల కోసం కోర్టెమ్ బేబీ’ (Coartem Baby) అనే మొదటి మలేరియా మందును WHO ఆమోదించింది.
  • ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం (ఏప్రిల్ 26): 2026 థీమ్ – “IP and Sports: Ready, Set, Innovate”.
  • ప్రపంచ మలేరియా దినోత్సవం (ఏప్రిల్ 25): 2026 థీమ్ – “Driven to end malaria: now we can, now we must”.
  • అంతర్జాతీయ పురస్కారం: మహిళా సాధికారతకు గానూ వియన్నాలో అవార్డు పొందిన భారతీయ మున్సిపల్ కార్పొరేషన్: గుంటూరు (ఆంధ్రప్రదేశ్).
  • కొత్త పుస్తకం: మాజీ సైన్యాధిపతి మనోజ్ ముకుంద్ నరవాణె రాసిన పుస్తకం: ద క్యూరియస్ ఆఫ్ ద క్లాసిఫైడ్’.
  • MSRTC అంబాసిడర్లు: మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమితులైన సినీ జంట: రితేష్ దేశ్‌ముఖ్ మరియు జెనీలియా.
  • గుర్బక్ష్ సింగ్ గ్రెవాల్: ఇటీవల కన్నుమూసిన ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ హాకీ క్రీడాకారుడు (1968 ఒలింపిక్ కాంస్య పతక విజేత).

Practice 27th Quiz

26th April 2026 one liners for all exams

  • నీతి ఆయోగ్ (NITI Aayog): సుమన్ బేరీ స్థానంలో కొత్త ఉపాధ్యక్షుడిగా నియమితులైన ప్రముఖ ఆర్థికవేత్త: అశోక్ లాహిరి.
  • యూఎస్ ఆర్మీ హాల్ ఆఫ్ ఫేమ్: అమెరికాలోని ‘యూఎస్ ఆర్మీ వార్ కాలేజ్’ ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న భారత ఆర్మీ చీఫ్: జనరల్ ఉపేంద్ర ద్వివేది.
  • ప్రధానమంత్రి అవార్డు: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో అత్యుత్తమ సేవల కోసం ఈ పురస్కారాన్ని అందుకున్న కేంద్ర పథకం: పీఎం గతి శక్తి యోజన.
  • సీఎం ఇన్‌స్పైర్ (CM Inspire): యూపీఎస్‌సీ అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం: మేఘాలయ.
  • ఆల్కలీన్ బ్యాటరీ యూనిట్: ఎవరీడీ (Eveready) కంపెనీ దేశంలోనే మొదటి ఆల్కలీన్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించింది: సాంబా జిల్లా (జమ్మూ కాశ్మీర్).
  • ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్: న్యూఢిల్లీలో 9వ ఎడిషన్ వాటర్ వీక్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి: సి.ఆర్. పాటిల్.
  • భారత్-ఆఫ్రికా ఫోరం సమ్మిట్ (IAFS): 2026 మే నెలలో 4వ ఎడిషన్ సదస్సుకు వేదిక కానున్న నగరం: న్యూఢిల్లీ.
  • ఏఐ (AI) డేటా ఒప్పందం: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్ సిటీల అభివృద్ధి కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది: జపాన్.
  • ఓటార్మెని (Otarmeani): జన్యుపరమైన బధిరత్వం (Genetic Deafness) చికిత్స కోసం యూఎస్ ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన మొదటి జీన్ థెరపీ.
  • ఐపీఎల్ రికార్డ్: ఐపీఎల్ చరిత్రలో 800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి బ్యాటర్‌గా రికార్డు సృష్టించిన ఆటగాడు: విరాట్ కోహ్లీ.

Practice April 26th Current Affairs Quiz

April 25th 2026 one-liners

  • ప్రపంచ మలేరియా దినోత్సవం (ఏప్రిల్ 25): 2026 థీమ్ – “Driven to end malaria: now we can, now we must”.
  • ప్రపంచ పెంగ్విన్ దినోత్సవం: ప్రతి ఏటా ఏప్రిల్ 25 నిర్వహిస్తారు (అతిపెద్ద జాతి: ఎంపరర్ పెంగ్విన్).
  • నాస్కామ్ (NASSCOM) చైర్‌పర్సన్: సింధు గంగాధరన్ స్థానంలో నియమితులైన వారు శ్రీకాంత్ వెలమకన్ని.
  • పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC) డైరెక్టర్: కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారు రాజేష్ కుమార్ అగర్వాల్.
  • రిలయన్స్ ఎంటర్‌ప్రైజ్ ఇంటెలిజెన్స్ సీఈఓ: గూగుల్, యాపిల్ మాజీ ఎగ్జిక్యూటివ్ పర్మిందర్ సింగ్ నియమితులయ్యారు.
  • దక్షిణ కొరియా అధ్యక్షుడు: 8 ఏళ్ల తర్వాత భారత్‌లో పర్యటించిన అధ్యక్షుడు లీ జే మ్యుంగ్.
  • OCI కార్డు సదుపాయం: శ్రీలంకలోని భారత సంతతి వ్యక్తుల కోసం OCI అర్హతను 6వ తరం వరకు పొడిగించారు.
  • నౌకాదళ విన్యాసం: భారత్ – శ్రీలంక మధ్య కొలంబోలో జరిగిన విన్యాసం పేరు ISLN డైవ్ ఎక్సర్‌సైజ్.
  • సోషల్ మీడియా నిషేధం: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం చేసిన దేశం టర్కీ.
  • బ్రేక్ త్రూ ప్రైజ్ 2026 (ఆస్కార్ ఆఫ్ సైన్స్): ఈ అవార్డు పొందిన భారతీయ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ అతాను నాథ్.
  • మీథేన్ ఉద్గారాలు: టాప్ 25 ఉద్గార సైట్లలో నిలిచిన భారత నగరాలు సికింద్రాబాద్ (4వ స్థానం), ముంబై (12వ స్థానం).
  • తైమూర్ (Taimoor): 600 కి.మీ లక్ష్య పరిధి గల స్వదేశీ యాంటీ-షిప్ క్రూయిజ్ మిస్సైల్‌ను పరీక్షించిన దేశం పాకిస్థాన్.
  • అండర్ వాటర్ టన్నెల్: యాంగ్జీ నది కింద 11.18 కి.మీ పొడవైన హై-స్పీడ్ రైల్ టన్నెల్‌ను పూర్తి చేసిన దేశం చైనా.
  • కొత్త మొక్క జాతి: అరుణాచల్ ప్రదేశ్‌లో కనుగొన్న కొత్త రకం మొక్క పేరు స్టోరెన్థెరా ఆరోగ్లోసా.
  • సేఫ్ సిటీస్ ప్రాజెక్ట్: మహిళల భద్రత కోసం మధ్యప్రదేశ్‌లో ఎంపికైన నగరం ధార్ (Dhar).
  • డోపింగ్ హై-రిస్క్: డోపింగ్ ఉల్లంఘనల కారణంగా భారత్ కేటగిరీ A’ (హై-రిస్క్) జాబితాలో చేరింది.
  • SAFF ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ 2026: ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం గోవా.
  • షూటింగ్ ప్రపంచకప్: కైరోలో జరిగిన ISSF పోటీల్లో స్వర్ణం గెలిచిన భారత జంట శాంభవి మరియు దివ్యాంశు.
  • గుర్రపు స్వారీ (Equestrian): ఐరోపా అంతర్జాతీయ పోటీల్లో రజత పతకం సాధించిన భారతీయుడు అనుష్ అగర్వాలా.
  • బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025: ఎకనమిక్ టైమ్స్ అవార్డుకు ఎంపికైన వారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
  • నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు: కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ నుండి ఈ పురస్కారం అందుకున్న హైదరాబాద్ శాస్త్రవేత్త డాక్టర్ సొంటి ఎస్. వెంకటేశ్వర్లు.

Practice April 25th Current Affairs Quiz

24th April one-liner Current Affairs

  • ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్ 2026: దేశంలో కొత్త గేమింగ్ నిబంధనలు అమలులోకి వచ్చే తేదీ: మే 1, 2026.
  • OGAI: ఆన్‌లైన్ గేమింగ్‌ను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేయనున్న కొత్త నియంత్రణ సంస్థ: ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా (OGAI).
  • వందేమాతరం 150 ఏళ్లు: ఈ సందర్భంగా కేంద్రం ప్రారంభించిన జాతీయ ఫిల్మ్ మేకింగ్ పోటీ: విఎం ఫ్రేమ్స్ (VM Frames).
  • అటల్ పెన్షన్ యోజన (APY): ఇటీవల 9 కోట్ల నమోదుల మైలురాయిని అధిగమించిన ప్రతిష్టాత్మక పథకం.
  • నేషనల్ పంచాయతీ రాజ్ దినోత్సవం: ప్రతి ఏటా ఏప్రిల్ 24 (73వ రాజ్యాంగ సవరణ చట్టం జ్ఞాపకార్థం) జరుపుకుంటారు.
  • అభయ్ (Abhay): డిజిటల్ అరెస్ట్ మోసాలను నివారించడానికి సిబిఐ (CBI) ప్రారంభించిన ఏఐ చాట్‌బాట్.
  • చంద్రునిపై కొత్త ఖనిజం: చైనా శాస్త్రవేత్తలు కనుగొన్న అరుదైన ఖనిజం పేరు: సీరియం మెగ్నీషియం చాక్సైట్.
  • అగ్రికల్చరల్ ఇంటెలిజెన్స్: ఏఐ ఆధారిత వ్యవసాయ నిర్ణయ సహాయక వ్యవస్థను ప్రారంభించిన సంస్థ: ఐఐటీ రోపర్ (IIT Ropar).
  • సెమీకండక్టర్ యూనిట్: దేశంలోనే మొదటి అడ్వాన్స్‌డ్ 3D సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్ ఎక్కడ ప్రారంభమైంది: భువనేశ్వర్ (ఒడిశా).
  • ప్రజ్ఞ (Prajna): డిఆర్‌డిఓ (DRDO-CAIR) రూపొందించిన AI-ఆధారిత శాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్.
  • ఓంకలో (Onkalo): ప్రపంచంలోనే మొదటి శాశ్వత భూగర్భ అణు వ్యర్థాల నిల్వ కేంద్రం ఎక్కడ ఉంది: ఫిన్లాండ్.
  • వరల్డ్ బుక్ క్యాపిటల్ 2026: యునెస్కో ద్వారా 2026కు గానూ ఎంపికైన నగరం: రబాత్ (మొరాకో).
  • బుల్గేరియా నూతన ప్రధాని: ఇటీవల ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాజీ అధ్యక్షుడు: రూమెన్ రాదేవ్ (Rumen Radev).
  • ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి: జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తర్వాత బాధ్యతలు చేపట్టనున్నది: జస్టిస్ లీసా గిల్.
  • ఇన్ఫోసిస్ బ్రాండ్ అంబాసిడర్: గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడైన టెన్నిస్ స్టార్: కార్లోస్ అల్కరాజ్.
  • యంగ్ గ్లోబల్ లీడర్స్ 2026: WEF జాబితాలో చోటు దక్కించుకున్న ప్రముఖ భారతీయులు: జై షా మరియు ఇషా అంబానీ.
  • కోణార్క్ పునరుద్ధరణ: జగమోహన్ అసెంబ్లీ హాల్ పునరుద్ధరణ పనుల కారణంగా వార్తల్లో నిలిచిన ప్రపంచ వారసత్వ ప్రదేశం: కోణార్క్ సూర్య దేవాలయం (ఒడిశా).
  • బ్లాక్ పగోడా: కోణార్క్ సూర్య దేవాలయానికి గల మరో పేరు (దీనిని 13వ శతాబ్దంలో మొదటి నరసింహదేవ నిర్మించారు).

24th April Quiz Test

23rd April one-liner Current Affairs

  • 99వ రామ్సర్ సైట్: భారతదేశపు 99వ రామ్సర్ సైట్‌గా గుర్తింపు పొందిన పక్షుల అభయారణ్యం: షేఖా జీల్ (అలీగఢ్, ఉత్తరప్రదేశ్).
  • గబ్బిలాల నివేదిక: ‘స్టేట్ ఆఫ్ ఇండియా బ్యాట్స్ 2024-25’ ప్రకారం అత్యధిక గబ్బిలాల జాతులు (68) కలిగిన రాష్ట్రం: పశ్చిమ బెంగాల్.
  • ఉమియం సరస్సు (బారాపాని): ఇటీవల లగ్జరీ రిసార్ట్ వివాదంతో వార్తల్లో నిలిచిన ఈ సరస్సు ఎక్కడ ఉంది: మేఘాలయ.
  • చక్కెర మిల్లుల దూరం: డ్రాఫ్ట్ చెరకు నియంత్రణ ఉత్తర్వు 2026 ప్రకారం, కొత్త మిల్లుల మధ్య కనీస దూరం: 25 కిలోమీటర్లు.
  • మాజీ సీఎం మృతి: ఇటీవల 90 ఏళ్ల వయసులో కన్నుమూసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 11వ ముఖ్యమంత్రి: నందెండ్ల భాస్కర రావు.
  • స్మోక్-ఫ్రీ జనరేషన్: 2009 తర్వాత జన్మించిన వారికి పొగాకు అమ్మకాలను నిషేధిస్తూ చట్టం చేసిన దేశం: యునైటెడ్ కింగ్‌డమ్ (UK).
  • బ్రిక్స్ అకడమిక్ ఫోరమ్: న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బ్రిక్స్ అకడమిక్ ఫోరమ్ ప్రధాన థీమ్: Resilience, Innovation, Cooperation & Sustainability.
  • భారత్ – భూటాన్ కస్టమ్స్ మీట్: 7వ జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ (JGC) సమావేశం జరిగిన ప్రాంతం: మూన్నార్, కేరళ.
  • ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం: భారత్ మరియు దక్షిణ కొరియా 2030 నాటికి ఎంత వాణిజ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి: 50 బిలియన్ డాలర్లు.
  • భారత జీడీపీ అంచనా: 2026లో భారత ఆర్థిక వ్యవస్థ 6.4% వృద్ధి చెందుతుందని అంచనా వేసిన సంస్థ: UNESCAP.
  • ఎస్‌బిఐ లక్ష్యం: 2030 నాటికి భారత జీడీపీలో తన బ్యాలెన్స్ షీట్‌ను **25%**కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న బ్యాంకు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
  • సెబీ పెట్టుబడి పరిమితి: సోషల్ ఇంపాక్ట్ ఫండ్స్‌లో కనీస పెట్టుబడిని సెబీ ఎంతకు తగ్గించింది: ₹1,000.
  • ఆరోగ్య బీమా కవరేజీ: NSSO నివేదిక ప్రకారం, ఏ ప్రాంతంలో ఆరోగ్య బీమా కవరేజీ (47.4%) ఎక్కువగా ఉంది: గ్రామీణ ప్రాంతాలు.
  • మార్కెట్ కప్లింగ్: విద్యుత్ వ్యాపారంలో ‘మార్కెట్ కప్లింగ్ ఆపరేటర్’గా నియమించబడిన సంస్థ: గ్రిడ్ ఇండియా.
  • రోమన్ స్పేస్ టెలిస్కోప్: హబుల్ కంటే 1000 రెట్లు వేగంగా అంతరిక్షాన్ని మ్యాప్ చేయగల నాసా కొత్త టెలిస్కోప్: నాన్సీ గ్రేస్ రోమన్ టెలిస్కోప్.
  • ట్రాల్ (TRAWL) సిస్టమ్: మైన్ ఫీల్డ్ బ్రీచింగ్ కోసం భారత సైన్యం ₹975 కోట్లతో ఏ సిస్టమ్ సేకరించనుంది: ట్రాల్ అసెంబ్లీ (BEML ద్వారా).
  • పునరావృత చెల్లింపుల పరిమితి: RBI నిబంధనల ప్రకారం, అదనపు అథెంటికేషన్ (AFA) లేకుండా జరిపే ఈ-మాండేట్ పరిమితి: ₹15,000.
  • గ్లోబల్ గ్రీన్ ఐకాన్: యూకేలో ‘గ్లోబల్ గ్రీన్ ఐకాన్’ అవార్డు అందుకున్న భారతీయుడు: జోగినపల్లి సంతోష్ కుమార్.
  • ప్రపంచ పారా అథ్లెటిక్స్ 2027: 2027 జూన్‌లో ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం: తాష్కెంట్, ఉజ్బెకిస్థాన్.
  • గరియా పూజ: ఇది ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమైన గిరిజన పండుగ: త్రిపుర.
  • సుబోరి ఉత్సవం: ఏనుగులతో స్నేహపూర్వక క్రీడలు నిర్వహించే ఈ ఉత్సవం ఎక్కడ జరుగుతుంది: అస్సాం.
  • పద్మశ్రీ మృతి: బుందేలీ యుద్ధ కళల నిపుణుడు, ఇటీవల మరణించిన వ్యక్తి: భగవందాస్ రైక్వార్.
  • ధరిత్రీ దినోత్సవం 2026 థీమ్: ఏప్రిల్ 22న జరుపుకున్న వరల్డ్ ఎర్త్ డే థీమ్: అవర్ పవర్, అవర్ ప్లానెట్’.
  • ఏప్రిల్ 23: ఈ రోజున జరుపుకునే అంతర్జాతీయ దినోత్సవాలు: ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవం & ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే.
  • ప్రపంచ పుస్తక రాజధాని 2026: యునైటెడ్ నేషన్స్ ద్వారా 2026కు ఎంపికైన నగరం: రబాత్ (మొరాకో).

22nd April 2026 one liner Current Affairs

  • ప్రజ్ఞ (Prajna): భద్రతా సంస్థల కోసం DRDO (CAIR) అభివృద్ధి చేసిన స్వదేశీ AI-ఆధారిత శాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్: ప్రజ్ఞ.
  • సమృద్ధి గ్రామ ఇన్షియేటివ్: అంతర్జాతీయ WSIS ప్రైజ్ 2026 కోసం నామినేట్ చేయబడిన భారతీయ గ్రామీణ అభివృద్ధి పథకం: సమృద్ధి గ్రామ ఇన్షియేటివ్.
  • పర్యాటక గైడ్: నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ విడుదల చేసిన దేశీయ పర్యాటక సమాచార పుస్తకం: దివ్య భారత్: ఆత్మ కి ఏక్ ఖిడ్కి’.
  • సంకేత భాషా సినిమా: సంజయ్ దత్ నటించిన, భారతీయ సంకేత భాషలో (Sign Language) విడుదల కానున్న మొదటి హిందీ చిత్రం: ఆఖ్రీ సవాల్ (Aakhri Sawal).
  • గ్రీన్ నోబెల్ 2026: 37 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా విజేతలందరూ మహిళలే నిలిచిన ప్రతిష్టాత్మక అవార్డు: గోల్డ్‌మన్ ఎన్విరాన్‌మెంటల్ ప్రైజ్.
  • ఓమెగా బాల్ (Omega Ball): ముగ్గురు జట్లు ఒకేసారి వృత్తాకార పిచ్‌పై ఆడేలా కొత్త ఫుట్‌బాల్ ఫార్మాట్‌ను రూపొందించిన సంస్థ: IIT మద్రాస్.
  • ప్లాంట్ సెల్ సెంటర్: మొక్కలను పెంచకుండానే వాటి కణాల నుండి పోషకాలను తయారు చేసే ఎక్సలెన్స్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు కానుంది: చెన్నై (IIT మద్రాస్ & హెర్బాలైఫ్).
  • హై-స్పీడ్ టన్నెల్: ప్రపంచంలోనే అత్యంత పొడవైన హై-స్పీడ్ అండర్ వాటర్ టన్నెల్ నిర్మిస్తున్న యాంగ్జీ నది ఏ దేశంలో ఉంది: చైనా.
  • ఆపిల్ (Apple) నాయకత్వం: టిమ్ కుక్ తర్వాత ఆపిల్ కంపెనీ కొత్త CEOగా బాధ్యతలు చేపట్టనున్న హార్డ్‌వేర్ నిపుణుడు: జాన్ టర్నస్ (John Ternus).
  • బంగారు గని: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ప్రారంభమవుతున్న భారతదేశపు మొదటి పెద్ద ప్రైవేట్ బంగారు గని: జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్.
  • నేషనల్ పార్క్ వివాదం: ఇటీవల ఎకో-సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్ రద్దు కారణంగా వార్తల్లో నిలిచిన కల్నల్ షేర్ జంగ్ (సింబల్బారా) నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది: హిమాచల్ ప్రదేశ్.
  • చింత ఆందోళన: కేన్-బెత్వా నదీ అనుసంధాన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసీలు మరియు రైతులు ఎక్కడ ఆందోళన చేపట్టారు: మధ్యప్రదేశ్ (ఛతర్‌పూర్ & పన్నా).
  • ఆయిల్ రిఫైనరీ: రాజస్థాన్ ప్రభుత్వ భాగస్వామ్యంతో జైపూర్ సమీపంలోని పచ్‌పద్ర వద్ద నిర్మిస్తున్న రాష్ట్ర మొదటి రిఫైనరీ: పచ్‌పద్ర రిఫైనరీ.
  • లోరియస్ అవార్డ్స్ 2026: స్పెయిన్‌కు చెందిన టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ‘స్పోర్ట్స్ మాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలుచుకున్నారు.
  • బుల్గేరియా ప్రధాని: బుల్గేరియాలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త ప్రధానమంత్రి: రూమెన్ రాదేవ్.
  • భారతీయ వీరుడి గౌరవం: ఆఫ్రికా దేశమైన మలావిలో ఏ భారతీయ పాలకుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు: మహారాజా రంజిత్ సింగ్.
  • జమున పండు మూలాలు: తాజా పరిశోధనల ప్రకారం జమున పండు యొక్క పుట్టుక మరియు అభివృద్ధి కేంద్రం: భారతదేశం.
  • చెస్‌ గ్రాండ్ మాస్టర్: పశ్చిమ బెంగాల్‌కు చెందిన అరణ్యక్ ఘోష్ భారతదేశపు 95 చెస్ గ్రాండ్ మాస్టర్‌గా నిలిచారు.
  • సృజనాత్మకత దినోత్సవం: ప్రతి ఏటా ఏప్రిల్ 21 జరుపుకునే అంతర్జాతీయ దినోత్సవం: వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డే.

April 22nd Current Affairs Quiz

2026 April 21st Question and Answers

  • అభయ్ (Abhay) AI చాట్‌బాట్: ఫేక్ నోటీసుల నుండి పౌరులను రక్షించడానికి, నోటీసుల యథార్థతను తనిఖీ చేసే ‘అభయ్’ చాట్‌బాట్‌ను ప్రారంభించిన సంస్థ: సీబీఐ (CBI).
  • విశ్వసూత్ర (Vishwasutra): గ్లోబల్ స్థాయిలో భారతీయ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఈ చొరవను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ: జౌళి మంత్రిత్వ శాఖ (Ministry of Textiles).
  • స్పేస్ రికార్డ్: తన ‘న్యూ గ్లెన్’ (New Glenn) రాకెట్ యొక్క రీ-యూజబుల్ బూస్టర్‌ను మొదటిసారి విజయవంతంగా ల్యాండ్ చేసిన సంస్థ: బ్లూ ఆరిజిన్ (Blue Origin).
  • హైవే ఆధునీకరణ: రాజస్థాన్‌లోని 800 కిలోమీటర్ల రాష్ట్ర రహదారుల అభివృద్ధి కోసం USD 225 మిలియన్ల రుణాన్ని ఆమోదించిన సంస్థ: ప్రపంచ బ్యాంక్.
  • ఫెమినా మిస్ ఇండియా 2026: భువనేశ్వర్‌లో జరిగిన పోటీల్లో ‘ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026’ కిరీటాన్ని గెలుచుకున్న గోవా యువతి: సాధ్వీ సతీష్ షెల్.
  • ఎం.ఎస్. స్వామినాథన్ అవార్డు: వ్యవసాయ రంగంలో విశేష కృషికి గానూ 2026 సంవత్సరానికి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న వ్యక్తి: డాక్టర్ చౌదరి శ్రీనివాస్ రావు (NAARM డైరెక్టర్).
  • WWF నేషనల్ అవార్డు: దురాక్రమణ మొక్కలను గుర్తించే ‘NeophyteID’ యాప్‌ను అభివృద్ధి చేసినందుకు ఈ అవార్డు పొందిన వృక్షశాస్త్రజ్ఞుడు: ఎన్. అలీమ్ యూసుఫ్ (కేరళ).
  • 3D సెమీకండక్టర్ యూనిట్: భారతదేశపు మొట్టమొదటి అధునాతన ‘3D సెమీకండక్టర్ ప్యాకేజింగ్ మరియు అసెంబ్లీ యూనిట్’ ఎక్కడ ప్రారంభించబడింది: భువనేశ్వర్, ఒడిశా.
  • పెట్రోగ్లిఫ్ పార్క్: పురాతన శిలా చిత్రాల పరిరక్షణ కోసం భారతదేశపు మొట్టమొదటి ‘పెట్రోగ్లిఫ్ కన్జర్వేషన్ పార్క్’కు పునాది రాయి వేసిన ప్రాంతం: లేహ్, లడఖ్ (సింధు ఘాట్).
  • మరీన్ స్పేషియల్ ప్లాన్: సముద్ర వనరుల నిర్వహణ కోసం నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్‌తో ఒప్పందం చేసుకున్న రాష్ట్రం: ఒడిశా.
  • జాతీయ పౌర సేవల దినోత్సవం: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21 జరుపుకునే ఈ రోజున, 1947లో సర్దార్ వల్లభాయ్ పటేల్ సివిల్ సర్వెంట్లను **’స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా’**గా అభివర్ణించారు.
  • UN చైనీస్ లాంగ్వేజ్ డే: ఐక్యరాజ్యసమితి చైనీస్ భాషా దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు: ఏప్రిల్ 20.
  • బాస్కెట్‌బాల్ దిగ్గజం మృతి: ఇటీవల 68 ఏళ్ల వయసులో కన్నుమూసిన బ్రెజిల్ బాస్కెట్‌బాల్ చరిత్రలో అత్యధిక పాయింట్లు సాధించిన ఆటగాడు: ఆస్కార్ ష్మిత్ (Oscar Schmidt).

2026 April11th Question and Answers

  • వాంతారా (Vantara) యూనివర్సిటీ: వన్యప్రాణులు మరియు వెటర్నరీ సైన్సెస్ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లోబల్ యూనివర్సిటీని గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రారంభించారు.
  • NSTFDC రజతోత్సవం: 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది.
  • నితీష్ కుమార్ పార్లమెంట్ ఎంట్రీ: బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ సుమారు రెండు దశాబ్దాల తర్వాత రాజ్యసభ (Rajya Sabha) సభ్యునిగా తిరిగి పార్లమెంటులో అడుగుపెట్టారు.
  • ఎక్సర్సైజ్ బ్రహ్మాస్త్ర: భారత సైన్యం ఈ విన్యాసాన్ని రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో నిర్వహించింది.
  • మఖానా (Fox Nuts) ఉత్పత్తి: భారతదేశంలో మఖానా ఉత్పత్తిలో బీహార్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది.
  • సి.డి. గోపీనాథ్ మరణం: 1952లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన భారత జట్టులో జీవించి ఉన్న చివరి సభ్యుడైన క్రికెటర్ సి.డి. గోపీనాథ్ కన్నుమూశారు.
  • ఆపరేషన్ హిమ్‌సేతు: సిక్కిం మంచు తుఫానులో చిక్కుకున్న పర్యాటకులను రక్షించడానికి భారత సైన్యం ఆపరేషన్ హిమ్‌సేతు’ చేపట్టింది.
  • ఆరోగ్య వన్ (Aarogya Van): జాతీయ రహదారుల వెంబడి ఔషధ మొక్కలను నాటడానికి NHAI ప్రారంభించిన కార్యక్రమం పేరు ఆరోగ్య వన్’.
  • నేషనల్ సేఫ్ మదర్‌హుడ్ డే: కస్తూర్బా గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఏప్రిల్ 11 ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
  • BPCL నూతన చైర్మన్: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) కొత్త CMDగా సంజయ్ ఖన్నా నియమితులయ్యారు.
  • పాలసీ బజార్ CEO: పాలసీ బజార్ (PolicyBazaar) కొత్త CEOగా సజ్జా ప్రవీణ్ చౌదరి బాధ్యతలు చేపట్టారు.
  • ఉత్తమ దర్శకుడు అవార్డు: చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2026లో ‘ధురంధర్’ చిత్రానికి ఆదిత్య ధర్ ఉత్తమ దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు.
  • అగ్రికల్చరల్ మార్కెటింగ్ రిఫామ్ ఇండెక్స్: నీతి ఆయోగ్ విడుదల చేసిన ఈ సూచీలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచింది.
  • కరెన్సీ మార్పిడి ఒప్పందం: ఆర్థిక సంబంధాల బలోపేతం కోసం UAE మరియు బహ్రెయిన్ దేశాలు కరెన్సీ మార్పిడి ఒప్పందంపై సంతకాలు చేశాయి.
  • నారిత్ AI (Narith AI): మాదకద్రవ్యాల కేసులను ఛేదించడానికి గుజరాత్ పోలీసులు ఈ AI టూల్‌ను ప్రారంభించారు.
  • కలాయ్ సెకండ్ (Kalai II) ప్రాజెక్ట్: అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్మించనున్న ఈ జలవిద్యుత్ ప్రాజెక్టు కోసం కేంద్రం ₹14,105.83 కోట్లు మంజూరు చేసింది.
  • లారా కార్డోసో ప్రపంచ రికార్డు: టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో 9 వికెట్లు తీసిన ప్రపంచంలోనే తొలి మహిళా క్రికెటర్‌గా బ్రెజిల్‌కు చెందిన లారా కార్డోసో నిలిచారు.
  • సింధీ భాషలో రాజ్యాంగం: భారత రాజ్యాంగం యొక్క తాజా ఎడిషన్‌ను సింధీ భాషలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ విడుదల చేశారు

Practice 11th April 2026 Quiz

2026 April10th Question and Answers

  • ప్రపంచ హోమియోపతి దినోత్సవం: ప్రతి ఏటా ఏప్రిల్ 10 జరుపుకుంటారు (2026 థీమ్: “Homeopathy for Sustainable Health”).
  • SEBI గడువు పొడిగింపు: IPO ఆమోదాలు మరియు కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ (MPS) నిబంధనల గడువును సెప్టెంబర్ 30, 2026 వరకు పొడిగించారు.
  • భారత జిడిపి అంచనా: 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జిడిపి వృద్ధి రేటును ప్రపంచ బ్యాంకు **6.6%**గా అంచనా వేసింది.
  • క్యాన్సర్ నోటిఫికేషన్: క్యాన్సర్ కేసుల డేటాను సేకరించడానికి తెలంగాణ ప్రభుత్వం దీనిని ‘నోటిఫై చేయదగిన వ్యాధి’గా ప్రకటించింది.
  • దివ్యంగుల కోసం పాస్‌పోర్ట్ సేవలు: బ్రెయిలీ మరియు సంజ్ఞా భాషా సేవలను ప్రారంభించిన తొలి ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంగా భోపాల్ నిలిచింది.
  • COP33 సదస్సు: 2028లో జరగాల్సిన COP33 వాతావరణ సదస్సు నిర్వహణ ప్రతిపాదన నుండి భారతదేశం ఇటీవల వైదొలిగింది.
  • వియత్నాం అధ్యక్షుడు: 2026-2031 కాలానికి వియత్నాం అధ్యక్షుడిగా తో లామ్ (To Lam) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  • అతిపెద్ద సహకార బ్యాంకు: ₹1 లక్ష కోట్ల వ్యాపార మైలురాయిని దాటి సారస్వత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ అతిపెద్ద పట్టణ సహకార బ్యాంకుగా అవతరించింది.
  • ఆర్టెమిస్ II రికార్డు: అంతరిక్షంలో మనుషులు ప్రయాణించిన అత్యధిక దూరం రికార్డును నాసాకు చెందిన ఆర్టెమిస్ II మిషన్ సృష్టించింది.
  • ముద్రా యోజన వార్షికోత్సవం: ఏప్రిల్ 8, 2026 నాటికి ప్రధానమంత్రి ముద్రా యోజన (PMMY) విజయవంతంగా 11 ఏళ్లు పూర్తి చేసుకుంది.
  • బ్రీతబుల్ బిల్డింగ్స్: భవనాల లోపల గాలి నాణ్యతను AI ద్వారా పర్యవేక్షించే ‘బ్రీతబుల్ బిల్డింగ్స్’ విధానాన్ని ముంబై నగరం ప్రారంభించింది.
  • పోషణ్ పఖ్వాడా 2026: పిల్లల మెదడు అభివృద్ధిపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమం ఏప్రిల్ 9 నుండి 23 వరకు నిర్వహించబడుతుంది.
  • గ్రహశకలం 2026 GD: ఏప్రిల్ 9న భూమికి అత్యంత సమీపం నుండి (చంద్రుని కక్ష్య కంటే తక్కువ దూరం) ప్రయాణించిన ఆస్టరాయిడ్ 2026 GD.
  • రణ్ సంవాద్ (Ran-Samvad): ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్త సదస్సు బెంగళూరులో నిర్వహించబడింది.
  • మహిళా రిజర్వేషన్లు: నారీ శక్తి వందన్ అధినియం ప్రకారం చట్టసభలలో మహిళలకు 33% కోటా కేటాయించారు.
  • క్వాంటం కమ్యూనికేషన్: క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ (QKD) ద్వారా 1000 కి.మీ దూరం సురక్షిత కమ్యూనికేషన్‌ను భారత్ సాధించింది.
  • మ్యూజ్ స్పార్క్ (Muse Spark): తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను పెంచేందుకు మెటా (Meta) సంస్థ ఈ కొత్త మోడల్‌ను విడుదల చేసింది.

Practice Daily Current Affairs Quiz April 10 2026

9th April 2026 Current Affairs Question & Affairs

  • యూత్ హెచ్‌ఐవి అవేర్‌నెస్ డే: యువతలో అవగాహన కోసం ప్రతి ఏటా ఏప్రిల్ 10 ‘నేషనల్ యూత్ హెచ్‌ఐవి మరియు ఎయిడ్స్ అవేర్‌నెస్ డే’ జరుపుకుంటారు.
  • పాయల్ నాగ్ రికార్డు: బ్యాంకాక్ ‘వరల్డ్ పారా ఆర్చరీ సిరీస్’లో ఒడిశాకు చెందిన పాయల్ నాగ్ స్వర్ణ పతకం సాధించారు.
  • అణు విద్యుత్ కేంద్రం: భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ‘ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్’ (PFBR) తమిళనాడులోని కల్పక్కంలో స్థాపించబడింది.
  • ఇంటెల్ ఎండీ: ఇంటెల్ ఆసియా పసిఫిక్ మరియు జపాన్ ప్రాంతానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా సంతోష్ విశ్వనాథన్ నియమితులయ్యారు.
  • బాబ్ సంవాద్ (BoB Samwad): భాషా అడ్డంకులను తొలగించడానికి ఏఐ ఆధారిత అనువాద ప్లాట్‌ఫారమ్‌ను బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రారంభించింది.
  • పాడ్ టాక్సీ ప్రాజెక్ట్: భారతదేశపు మొట్టమొదటి డ్రైవర్ రహిత పాడ్ టాక్సీ ప్రాజెక్టుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
  • ఆవో లేయాంగ్ మోన్యు: ఈ వసంతోత్సవ పండుగను నాగాలాండ్ లోని ‘కొన్యాక్’ తెగ ప్రజలు నూతన సంవత్సరంగా జరుపుకుంటారు.
  • సైక్లోన్ వ్యాయామం: భారత్ – ఈజిప్ట్ దేశాల మధ్య జరిగే ‘సైక్లోన్’ సైనిక వ్యాయామం 4వ ఎడిషన్ ఈజిప్ట్ లో నిర్వహించబడుతోంది.
  • మొహసినా కిద్వాయ్ మరణం: మాజీ కేంద్ర మంత్రి మరియు ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు మొహసినా కిద్వాయ్ 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
  • సూపర్ ఎర్త్స్ (Super Earths): భూమి కంటే పెద్దవిగా, నెప్ట్యూన్ కంటే చిన్నవిగా ఉండే గ్రహాలను ఖగోళ శాస్త్రవేత్తలు సూపర్ ఎర్త్స్’ అని పిలుస్తారు.
  • 10G ఇంటర్నెట్: ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్ 10G U6 GHz ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రారంభించింది.
  • ఆర్.కె. రాఘవన్ ఆత్మకథ: సీబీఐ మాజీ డైరెక్టర్ ఆర్.కె. రాఘవన్ తన జీవిత విశేషాలతో ఎ రోడ్ వెల్ ట్రావెల్డ్’ అనే పుస్తకాన్ని రచించారు.
  • ముఖ్యమంత్రి అన్నపూర్ణ యోజన: పేదలకు అదనంగా 5 కిలోల ఉచిత బియ్యాన్ని అందించే ఈ పథకాన్ని ఒడిశా ప్రభుత్వం ఆమోదించింది.
  • బిబిసి (BBC) కొత్త డైరెక్టర్: బిబిసి నూతన డైరెక్టర్ జనరల్‌గా మ్యాట్ బ్రిటన్ బాధ్యతలు స్వీకరించారు.
  • బెంగళూరు 10కె అంబాసిడర్: ‘వరల్డ్ 10కె బెంగళూరు 2026’ పోటీలకు క్రొయేషియా క్రీడాకారిణి బ్లాంకా వ్లాసిక్ గ్లోబల్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.
  • ATL సారథి: పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ తెలంగాణలో ‘ATL సారథి’ ప్రాజెక్టును ప్రారంభించింది.

Test April 9th 2026 Current Affairs Quiz

April 8th 2026 Current Affairs Question & Answers

  • నివారణ వారం: ప్రతి ఏటా ఏప్రిల్ 1 నుండి 7 వరకు అంధత్వంపై అవగాహన కోసం ఈ వారాన్ని నిర్వహిస్తారు. అంధత్వ
  • UPI లావాదేవీల వృద్ధి: 2025 నివేదిక ప్రకారం, UPI QR కోడ్ లావాదేవీల విలువలో 33% వృద్ధి నమోదైంది.
  • శ్రీ కృష్ణ దేవరాయ సైనిక పాఠశాల: కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరులో ఈ నూతన సైనిక పాఠశాల ప్రారంభమైంది.
  • యస్ బ్యాంక్ నూతన సీఈఓ: యస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా వినయ్ టోన్సే బాధ్యతలు స్వీకరించారు.
  • సరుకు రవాణాలో అగ్రస్థానం: 2025-26 ఆర్థిక సంవత్సరంలో గుజరాత్‌లోని దీన్‌దయాల్ పోర్ట్ (కాండ్లా) దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
  • దివ్య సింగ్ రికార్డు: కేవలం 14 రోజుల్లో సైకిల్‌పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకుని ఉత్తరప్రదేశ్‌కు చెందిన దివ్య సింగ్ రికార్డు సృష్టించారు.
  • స్వచ్ఛమైన తాగునీరు: ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉన్న దేశంగా స్విట్జర్లాండ్ ప్రథమ స్థానంలో నిలిచింది.
  • వన్ హెల్త్ సమ్మిట్ 2026: ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఫ్రాన్స్‌లోని లియోన్ నగరంలో ఈ సదస్సు జరిగింది.
  • భూమి వనరుల శాఖ కార్యదర్శి: 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నరేంద్ర భూషణ్ ఈ శాఖకు కార్యదర్శిగా నియమితులయ్యారు.
  • తొలి LGBTQ+ ఎంపీ: భారత పార్లమెంటులో మొట్టమొదటి ‘ఓపెన్లీ క్వీర్’ రాజ్యసభ సభ్యురాలిగా మేనక గురుస్వామి (తృణమూల్ కాంగ్రెస్) నియమితులయ్యారు.
  • వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్: దాద్రి నుండి జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ వరకు నిర్మించిన ఈ కారిడార్ మొత్తం పొడవు 1506 కి.మీ.
  • రూపా బాయోర్ రికార్డు: తైక్వాండో ప్రపంచ ర్యాంకింగ్‌లో 5వ స్థానానికి చేరుకున్న తొలి భారతీయురాలిగా అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన రూపా బాయోర్ నిలిచారు.
  • చేతక్ స్క్రీన్ అవార్డ్స్: 2026 అవార్డులలో హోమ్ బౌండ్’ (Homebound) చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచింది.
  • వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్: బ్యాంకాక్‌లో జరిగిన ఈ పోటీలలో భారత్ 16 పతకాలతో మెడల్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
  • విక్రమాదిత్య వైదిక గడియారం: కాశీ విశ్వనాథ ధామ్‌లో ఏర్పాటు చేసిన ఈ గడియారం వైదిక పంచాంగం (ముహూర్తాలు, తిథి) ప్రకారం సమయాన్ని చూపుతుంది.
  • రైల్వే ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్ట్: పశ్చిమ రైల్వే పరిధిలో ఫైబర్ కేబుల్ వేయడానికి భారతీయ రైల్వే ₹398 కోట్లను ఆమోదించింది.
  • సబ్ జూనియర్ హాకీ: 16వ హాకీ ఇండియా సబ్ జూనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్‌షిప్ బీహార్‌లోని రాజ్ గీర్ లో జరుగుతోంది.
  • స్పోర్ట్స్ ఆల్ఫాబెట్ బుక్ లెట్: అక్షరమాల ద్వారా పిల్లల్లో క్రీడలపై అవగాహన పెంచే ఈ పుస్తకాన్ని డాక్టర్ కనిష్క పాండే రూపొందించారు.
April8th 2026 one liners
April8th 2026 one liners

7th April 2026 Current Affairs Questions with Answers

  • ప్రపంచ ఆరోగ్య దినోత్సవం: ప్రతి ఏటా ఏప్రిల్ 7 జరుపుకుంటారు (2026 థీమ్: “Together for Health, Stand with Science”).
  • ఐపీఎల్ రికార్డు: ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన మొట్టమొదటి ఫాస్ట్ బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ రికార్డు సృష్టించారు.
  • సాధన సప్తాహ 2026: సివిల్ సర్వెంట్ల సామర్థ్యాన్ని పెంచడానికి మిషన్ కర్మయోగి’ కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
  • స్కూల్ చలే హమ్: పాఠశాల నమోదును పెంచడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది.
  • కృష్ణ జింకల పునరాగమనం: 50 ఏళ్ల తర్వాత ఛత్తీస్‌గఢ్‌లోని బర్నవాపరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కృష్ణ జింకలు మళ్ళీ కనిపించాయి.
  • ఐఎన్ఎస్ అరిదమన్: భారత నౌకాదళంలో చేరిన ఇది దేశీయంగా నిర్మించిన మూడవ అణుశక్తి బాలిస్టిక్ మిసైల్ జలాంతర్గామి (SSBN).
  • నేషనల్ బుక్ క్రిటిక్స్ అవార్డు: ‘మదర్ మేరీ కమ్స్ టు మీ’ అనే రచనకు గాను ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ ఈ అవార్డును గెలుచుకున్నారు.
  • ప్రాజెక్ట్ చేతక్: సరిహద్దు ప్రాంతాల్లో రోడ్డు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) కు చెందిన ప్రాజెక్ట్ ఇది.
  • రామచరితమానస్ హస్తప్రతి: 200 ఏళ్ల పురాతనమైన అరుదైన ప్రతిని అయోధ్యలోని అంతర్జాతీయ రామకథా సంగ్రహాలయంలో చేర్చారు.
  • మానవతా సహాయం: ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బందులు పడుతున్న ఆఫ్ఘనిస్తాన్ దేశానికి భారతదేశం ఇటీవల అవసరమైన వస్తువులను పంపింది.
  • AI మార్గదర్శకాలు: తీర్పులు రాయడంలో AI వినియోగంపై ఖచ్చితమైన మానవ విచక్షణ ఉండాలని గుజరాత్ హైకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది.
  • ఆన్‌లైన్ బెట్టింగ్ నిషేధం: జూదాన్ని అరికట్టేందుకు 7,000 కంటే ఎక్కువ యాప్‌లను ఇటీవల నేపాల్ ప్రభుత్వం నిషేధించింది.
  • ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు: ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా భారతదేశం అవతరించింది.
  • హల్వా పంపిణీ: తొలిసారి ఓటు వేసే యువతను ప్రోత్సహించడానికి కేరళ ఎన్నికల సంఘం హల్వా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది.
  • వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా: భారత జాతీయ చిహ్నాల గురించి వివరించే ఈ పుస్తకాన్ని ప్రముఖ సంగీత విద్వాంసుడు టీ.ఎం. కృష్ణ (T.M. Krishna) రచించారు.

Practice April 7th Free Current Affairs Test

April 6th 2026 Current Affairs

  • అంతర్జాతీయ క్రీడా దినోత్సవం: అభివృద్ధి మరియు శాంతి కోసం ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా ఏప్రిల్ 6 ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది (భారత్‌లో జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29).
  • భూ భారతి (Bhu Bharati) పోర్టల్: భూ రికార్డుల నమోదు మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళతరం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ పోర్టల్‌ను ప్రారంభించింది.
  • కుల ఆధారిత ఆర్థిక సర్వే: భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రవ్యాప్త కుల ఆధారిత సామాజిక-ఆర్థిక సర్వేను పంజాబ్ ప్రభుత్వం చేపట్టింది.
  • SAIL తాత్కాలిక చీఫ్: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) చైర్మన్ అమరేందు ప్రకాష్ రాజీనామా చేయడంతో కృష్ణ కుమార్ సింగ్ తాత్కాలిక బాధ్యతలు స్వీకరించారు.
  • సబ్ పర్ రామ్ తపస్వీ రాజా: ఆశుతోష్ అగ్నిహోత్రి రచించిన ఈ పుస్తకాన్ని ఇటీవల మణిపూర్ గవర్నర్ ఆవిష్కరించారు.
  • శ్రీలంక – ప్రపంచ బ్యాంక్ ఒప్పందం: ఆర్థిక సంక్షోభం నుండి కోలుకోవడానికి శ్రీలంక దేశంతో ప్రపంచ బ్యాంక్ కొత్తగా ఐదేళ్ల భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
  • నమో డ్రోన్ దీదీ శిక్షణ: మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇవ్వడంలో కర్ణాటక రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
  • SAFF U-20 ఛాంపియన్‌షిప్ 2026: సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ నిర్వహించిన అండర్-20 ఫుట్‌బాల్ టైటిల్‌ను బంగ్లాదేశ్ గెలుచుకుంది.
  • రొంగాలి బిహు (Rongali Bihu): అస్సామీ కొత్త సంవత్సరం మరియు వసంత కాలం రాకను సూచించే ఈ పండుగను అస్సాం రాష్ట్రంలో ఘనంగా జరుపుకుంటారు.
  • ఐఎన్ఎస్ సునయన (INS Sunayna): హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత కోసం మోహరించిన ఈ నౌక ఒక ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్ (OPV).
  • కర సాథి (Kar Sathi) AI చాట్‌బాట్: ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేసేవారి సందేహాలను తీర్చడానికి ఆదాయపు పన్ను శాఖ దీనిని ప్రారంభించింది.
  • నో యువర్ క్యాండిడేట్ (KYC): ఓటర్లు తమ అభ్యర్థుల నేర చరిత్ర మరియు ఆస్తుల వివరాలను తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం (ECI) ఈ ఫీచర్‌ను తెచ్చింది.
  • I&B మంత్రిత్వ శాఖ కార్యదర్శి: సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ నూతన కార్యదర్శిగా చంచల్ కుమార్ నియమితులయ్యారు.
  • ఏపీ ఏకైక రాజధాని బిల్లు: అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తించే పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
  • హార్ముజ్ జలసంధి (Strait of Hormuz): వాణిజ్య నౌకల రక్షణపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్ వాయిదా పడిన కీలక జలసంధి ఇది.
  • డెంగ్యూ వ్యాక్సిన్ ‘క్యూ డెంగా’: డెంగ్యూ నివారణ కోసం క్యూ డెంగా (Qdenga) అనే టెట్రావాలెంట్ వ్యాక్సిన్‌కు DCGI ఇటీవల ఆమోదం తెలిపింది.
  • Ind AS ప్రమాణాలు: బీమా రంగంలో పారదర్శకత కోసం ఏప్రిల్ 1, 2026 నుండి ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ (Ind AS) పాటించాలని IRDAI ఆదేశించింది.
  • మిషన్ ఇంద్రధనుష్: పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు పూర్తిస్థాయిలో టీకాలు (వ్యాక్సినేషన్) వేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం.

April 5th 2026 Current Affairs

  • ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ క్రీడల తొలి ఎడిషన్‌లో కర్ణాటక (23 స్వర్ణాలతో) పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది (దీని మస్కట్ ‘వీర్ మోర్’).
  • మాఝే గావ్ ఆరోగ్య సంపన్న గావ్: గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా ECG, డయాలసిస్ సేవలు అందించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రచారాన్ని ప్రారంభించింది.
  • పూర్వాంచల్ మహోత్సవం (Maati-9): తూర్పు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ సంస్కృతిని చాటిచెప్పే ఈ వేడుక ఇటీవల కొత్త ఢిల్లీలో నిర్వహించబడింది.
  • కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్: భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ బొగ్గు గ్యాసిఫికేషన్ ఆధారిత అమోనియం నైట్రేట్ ప్లాంట్‌ను ఒడిశా (లఖన్‌పూర్) లో ఏర్పాటు చేస్తున్నారు.
  • సౌర విద్యుత్ ఉత్పత్తి 2025: IRENA నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సౌర విద్యుత్ ఉత్పత్తిలో చైనా తర్వాత భారతదేశం రెండవ స్థానంలో నిలిచింది.
  • జాతీయ సముద్ర దినోత్సవం (National Maritime Day): 1919లో మొదటి భారతీయ వాణిజ్య నౌక ‘ఎస్ఎస్ లాయల్టీ’ ప్రయాణాన్ని స్మరిస్తూ ప్రతి ఏటా ఏప్రిల్ 5 ఈ దినోత్సవం జరుపుకుంటారు.
  • డోపింగ్ ఉల్లంఘనల జాబితా: డోపింగ్ కారణంగా సస్పెండ్ అయిన ‘ట్రాక్ అండ్ ఫీల్డ్’ అథ్లెట్ల గ్లోబల్ జాబితాలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
  • మై ట్రాన్స్‌క్రైబ్ వన్ (My Transcribe One): 25 అంతర్జాతీయ భాషలకు మద్దతు ఇచ్చే అత్యంత ఖచ్చితమైన AI ట్రాన్స్‌క్రిప్షన్ మోడల్‌ను మైక్రోసాఫ్ట్ (Microsoft) ప్రవేశపెట్టింది.
  • ఐఎన్ఎస్ అరిదమన్ (INS Aridaman): భారత నౌకాదళం తన మూడవ అణు సామర్థ్యం గల బాలిస్టిక్ మిసైల్ సబ్ మెరైన్‌ను విశాఖపట్నంలో కమిషన్ చేసింది.
  • రాజా రవివర్మ పెయింటింగ్: ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన ‘కృష్ణుడు మరియు యశోద’ పెయింటింగ్ వేలంలో ₹167.20 కోట్లకు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది.

One-line Current Affairs 4th April 2026

  1. NCERT ‘డీమ్డ్ యూనివర్సిటీ’ హోదా: పాఠశాల విద్యలో పరిశోధనలను ప్రోత్సహించడానికి విద్యా మంత్రిత్వ శాఖ NCERTకి డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పించింది.
  2. OTT సిమ్ బైండింగ్ గడువు: సైబర్ నేరాలను అరికట్టడానికి OTT ప్లాట్‌ఫారమ్‌లు సిమ్ బైండింగ్ నిబంధనలను అమలు చేయాల్సిన గడువును 31 డిసెంబర్ 2026 వరకు పొడిగించారు.
  3. డిజిటల్ జనగణన 2027 రాయబారి: భారతదేశపు మొదటి పూర్తి డిజిటల్ జనగణన కోసం ప్రముఖ సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.
  4. PMAY-G 10 ఏళ్లు: ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ (PMAY-G) పథకం 1 ఏప్రిల్ 2026 నాటికి విజయవంతంగా 10 ఏళ్లు పూర్తి చేసుకుంది.
  5. ఉత్తమ జిల్లా పంచాయతీ: పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ అవార్డుల్లో త్రిపుర రాష్ట్రానికి చెందిన సిపాహీజాల జిల్లా పంచాయతీ దేశంలోనే ఉత్తమమైనదిగా నిలిచింది.
  6. కోల్ టు అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్ట్: భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ‘బొగ్గు నుండి అమ్మోనియం నైట్రేట్’ తయారు చేసే ప్రాజెక్టును ఒడిశా (లఖన్‌పూర్)లో ఏర్పాటు చేశారు.

అంతర్జాతీయ అంశాలు (International)

  • మంగోలియా నూతన ప్రధాని: మంగోలియా దేశ కొత్త ప్రధాన మంత్రిగా 39 ఏళ్ల ఉచ్రల్ న్యామ్-ఓసోర్ ఎన్నికయ్యారు.
  • బుర్కినా ఫాసోకు భారత్ సాయం: ఆహార భద్రత కోసం భారత్ ఇటీవల బుర్కినా ఫాసో అనే ఆఫ్రికన్ దేశానికి 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపింది.
  • ఇంటర్నెట్ షట్‌డౌన్ రిపోర్ట్ 2025: ప్రపంచంలో అత్యధికంగా ఇంటర్నెట్ నిలిపివేసిన దేశాల్లో మయన్మార్ మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండవ స్థానంలో ఉంది.
  • మయన్మార్ అధ్యక్షుడు: మయన్మార్ మిలిటరీ చీఫ్ మిన్ ఆంగ్ హ్లాంగ్ ఆ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

ఆర్థిక & బ్యాంకింగ్ (Economy)

  1. మార్చి 2026 GST వసూళ్లు: బలమైన ఆర్థిక వృద్ధి కారణంగా మార్చి నెలలో GST వసూళ్లు ₹2.1 లక్షల కోట్లకు చేరి 11 నెలల గరిష్టాన్ని నమోదు చేశాయి.
  2. UPI లావాదేవీల రికార్డు: మార్చి 2026 నెలలో మొత్తం UPI లావాదేవీల సంఖ్య 22.64 బిలియన్లకు (విలువ ₹29.53 లక్షల కోట్లు) చేరింది.
  3. ఫ్లోటింగ్ రేట్ బాండ్ వడ్డీ: ఏప్రిల్ 4 నుండి అక్టోబర్ 3, 2026 వరకు ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లోటింగ్ రేట్ బాండ్ 2028’ వడ్డీ రేటును RBI 6.17% గా నిర్ణయించింది.

సైన్స్ & టెక్నాలజీ (Science & Tech)

  1. ఆర్టెమిస్ II మొదటి మహిళ: నాసా చేపట్టిన ఆర్టెమిస్ II మిషన్ ద్వారా చంద్రుని కక్ష్యలోకి వెళ్లనున్న తొలి మహిళా వ్యోమగామి క్రిస్టినా కోచ్.
  2. మిషన్ మిత్ర: గగన్‌యాన్ వ్యోమగాములకు అతి క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో శిక్షణ ఇచ్చేందుకు లడఖ్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమం పేరు ‘మిషన్ మిత్ర’.

పర్యావరణం & క్రీడలు (Environment & Sports)

  1. పునరుత్పాదక ఇంధన మార్కెట్: IRENA నివేదిక ప్రకారం, ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద పునరుత్పాదక ఇంధన మార్కెట్‌గా భారతదేశం (250.5 GW సామర్థ్యంతో) నిలిచింది.
  2. ఏషియన్ స్క్వాష్ అవార్డ్స్: ‘మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును భారత స్క్వాష్ క్రీడాకారుడు అభయ్ సింగ్ గెలుచుకున్నారు.

ముఖ్యమైన రోజులు (Important Days)

  1. అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవం: గనుల (Landmines) ప్రమాదాల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా ఏప్రిల్ 4 ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
  2. మైన్ అవేర్‌నెస్ డే 2026 థీమ్: ఈ ఏడాది (2026) థీమ్ — “Invest in Peace; Invest in Mine Action”.

Practice April 4th 2026 Quiz

3rd April 2026 one liner Question & Answer

  1. ముఖ్యమంత్రి మామా ధియా సత్కార్ యోజన: మహిళలకు ఆర్థిక సహాయం అందించే ఈ కొత్త పథకాన్ని ఇటీవల పంజాబ్ కేబినెట్ ఆమోదించింది.
  2. ప్రైడ్ ఆఫ్ హిల్స్ (Pride of Hills): 9 హిమాలయ రాష్ట్రాల కనెక్టివిటీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 25,000 కోట్లతో ప్రారంభించిన పథకం పేరు ఇది.
  3. ఎన్డీఆర్ఎఫ్ (NDRF) నూతన చీఫ్: 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పీయూష్ ఆనంద్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
  4. యువిక (YUVIKA): విద్యార్థులలో అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ఇస్రో (ISRO) నిర్వహిస్తున్న కార్యక్రమం పేరు ‘యువ విజ్ఞాని కార్యక్రమం’.
  5. ప్రెసిడెంట్స్ కలర్ పురస్కారం: పోలీస్ విభాగంలో అత్యుత్తమ సేవలకు గాను ఇటీవల ఒడిశా మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల పోలీసు దళాలకు ఈ గౌరవం లభించింది.
  6. న్యాయ సేతు (Nyaya Setu): సామాన్య ప్రజలకు చట్టపరమైన సమాచారం అందించడానికి కేంద్రం ప్రారంభించిన AI చాట్‌బాట్ పేరు ఇది (దీని మాస్కట్ ‘దిశిక’).
  7. బోధన శివానందన్: బ్రిటన్ (UK) లో టాప్ మహిళా చెస్ ప్లేయర్‌గా నిలిచిన 11 ఏళ్ల భారత సంతతి బాలిక ఈమె.
  8. అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్: ప్రైవేట్ అంతరిక్ష స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ఈ ఫండ్‌ను సిడ్బీ (SIDBI) వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్ నిర్వహిస్తోంది.
  9. IMF – వరల్డ్ బ్యాంక్ సమావేశాలు 2026: 2026లో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక వార్షిక ఆర్థిక సమావేశాలకు థాయిలాండ్ (బ్యాంకాక్) ఆతిథ్యం ఇవ్వనుంది.
  10. స్టార్‌లింక్ ఒప్పందం: కొండ ప్రాంతాల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం మేఘాలయ ప్రభుత్వం స్టార్‌లింక్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది.
  11. స్నేక్ ఐడెంటిఫికేషన్ యాప్: పాములను గుర్తించడానికి మరియు మరణాలను తగ్గించడానికి కోస్టారికా దేశం ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రారంభించింది.
  12. E20 ఇంధనం: పెట్రోల్ పంపుల్లో సరఫరా అయ్యే E20 ఇంధనం అంటే 20% ఇథనాల్ మరియు 80% పెట్రోల్ మిశ్రమం అని అర్థం.
  13. ఏపీ ఏకైక రాజధాని: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సవరణ ప్రకారం, అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక రాజధానిగా ఉంటుంది.
  14. చేనేత/పవర్‌లూమ్ ఉచిత విద్యుత్: ఏపీలో చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్‌లూమ్ ఆపరేటర్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నారు.
  15. CME ఫ్రేమ్‌వర్క్ వాయిదా: RBI తన సవరించిన క్యాపిటల్ మార్కెట్ ఎక్స్‌పోజర్ (CME) అమలును జూలై 1, 2026 వరకు పొడిగించింది.
  16. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డ్స్: భారతదేశం మరియు దక్షిణాసియాలో ఢిల్లీ (IGIA) విమానాశ్రయం ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది.
  17. ఆర్మీ వైస్ చీఫ్ (VCOAS): భారత సైన్యం వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు.
  18. డిఫెన్స్ క్యాపిటల్ బడ్జెట్: రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) FY 2025-26లో తన కేటాయించిన మూలధన వ్యయాన్ని (రూ. 1.86 లక్షల కోట్లు) 100% వినియోగించుకుంది.

Practice 3rd April Current Affairs Quiz

2nd April 2026 One Liner Current Affairs

  1. IRCC సర్టిఫికేట్లు: నాగోయా ప్రోటోకాల్ కింద ‘అనుపాలన ధృవీకరణ పత్రాలను’ (IRCC) జారీ చేయడంలో భారతదేశం (56% వాటాతో) ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
  2. నక్సలిజం నిర్మూలన: కేంద్ర ప్రభుత్వం భారతదేశం నుండి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి మార్చి 31, 2026ని గడువుగా నిర్ణయించింది.
  3. జీరో వేస్ట్ సిటీ: ఐక్యరాజ్యసమితి ‘జీరో వేస్ట్’ నగరాల చొరవలో చేరిన తొలి భారతీయ నగరం వర్కాల (కేరళ).
  4. సెలెస్టే మిషన్ (Celeste): యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) తన గెలీలియో నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి సెలెస్టే పేరుతో ఉపగ్రహాలను ప్రయోగించింది.
  5. సెమీకండక్టర్ ప్లాంట్: ప్రధాని మోదీ ఇటీవల ‘కైన్స్ టెక్నాలజీ’ సెమీకండక్టర్ ప్లాంట్‌ను గుజరాత్‌లోని సాణంద్ (Sanand) లో ప్రారంభించారు.
  6. ద్వీప శక్తి (Dwipa Shakti): భారత సైనిక సంసిద్ధతను చాటే ఈ ఉమ్మడి విన్యాసాలు అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్వహించబడ్డాయి.
  7. కారీబా డ్యామ్ (Kariba Dam): జింబాబ్వే దేశం తన కారీబా ఆనకట్ట వద్ద 500 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించింది.
  8. S&P గ్లోబల్ CSA ర్యాంకింగ్: కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్‌మెంట్‌లో భారతీయ బ్యాంకుల్లో యెస్ బ్యాంక్ (Yes Bank) అగ్రస్థానంలో నిలిచింది.
  9. BMC మొదటి మహిళా కమిషనర్: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తొలి మహిళా కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి అశ్విని భిడే నియమితులయ్యారు.
  10. యమహా బ్రాండ్ అంబాసిడర్: 2026 సంవత్సరానికి గాను ‘యమహా మ్యూజిక్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్‌గా ఏ.ఆర్. రెహమాన్ ఎంపికయ్యారు.
  11. నేషనల్ బుక్ క్రిటిక్స్ అవార్డు: అరుంధతీ రాయ్ రాసిన మదర్ మేరీ కమ్స్ టు మీ’ (ఆత్మకథ) కు ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.
  12. టైడ్స్ ఆఫ్ టైమ్: పార్లమెంటులోని కుడ్యచిత్రాల ద్వారా భారత చరిత్రను వివరించే ఈ పుస్తకాన్ని సుధా మూర్తి రాశారు.
  13. జపనీస్ గ్రాండ్ ప్రిక్స్: ఈ రేసును గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడైన రేసర్‌గా ఆండ్రియా కెమి ఆంటోనెల్లి రికార్డు సృష్టించారు.
  14. భవసాగర్ కేంద్రం: భారతదేశపు మొట్టమొదటి లోతైన సముద్ర జీవుల జాతీయ నిధి (National Repository) కేరళలోని కొచ్చిలో ఉంది.
  15. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఆటిజం పట్ల అవగాహన కల్పించే రోజుగా జరుపుకుంటారు.
  16. అల్బినో హిమాలయన్ తహర్: తెల్లని రంగులో ఉండే ఈ అరుదైన జీవి హిమాచల్ ప్రదేశ్‌లోని కుగ్తి వన్యప్రాణి అభయారణ్యంలో కనిపించింది.

Practice ఏప్రిల్ 2, 2026 కరెంట్ అఫైర్స్ Quiz

ఏప్రిల్ 1, 2026 – డైలీ కరెంట్ అఫైర్స్ (One-Liners)

  1. సమ్రాట్ సంప్రతి మ్యూజియం: ప్రధాని మోదీ ఇటీవల ఈ మ్యూజియంను గుజరాత్‌లోని గాంధీనగర్ (కోబా తీర్థం) లో ప్రారంభించారు.
  2. భారత జనగణన 2027: డిజిటల్ ఫార్మాట్‌లో జరగనున్న ఈ సెన్సస్ మొదటి దశ ఏప్రిల్ 1, 2026 నుండి ప్రారంభమైంది.
  3. ఆర్‌బీఐ స్థాపన దినోత్సవం: ఏప్రిల్ 1, 2026 నాటికి భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) 91 ఏళ్లు పూర్తి చేసుకుంది.
  4. క్వాంటం కంప్యూటర్: భారతదేశపు మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్‌ను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రారంభించనున్నారు.
  5. ఆర్టెమిస్ 2: అపోలో 17 తర్వాత 53 ఏళ్లకు నాసా చేపడుతున్న మొదటి మానవ సహిత చంద్ర మిషన్ పేరు ఆర్టెమిస్ 2.
  6. దూనాగిరి (Dunagiri): ప్రాజెక్ట్ 17A కింద స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ఈ స్టెల్త్ ఫ్రిగేట్ నౌకను ఇటీవల నౌకాదళానికి అప్పగించారు.
  7. ఐఎన్ఎస్ విశాల్: భారత నౌకాదళానికి ఇటీవల అప్పగించిన చివరి సర్వేక్షణ్ నౌక (Survey Vessel) పేరు విశాల్.
  8. సన్‌షైన్ డబుల్ 2026: ఇండియన్ వెల్స్ మరియు మయామి ఓపెన్ రెండింటినీ గెలిచి ఈ ఘనత సాధించిన టెన్నిస్ క్రీడాకారుడు జానిక్ సినర్.
  9. ఐపీఎల్ రికార్డు: ఐపీఎల్ చరిత్రలో రన్ ఛేజింగ్‌లో 4000 పరుగులు పూర్తి చేసిన మొదటి బ్యాటర్ విరాట్ కోహ్లీ.
  10. మేజర్ లీగ్ క్రికెట్ (MLC): అమెరికన్ MLCలో చేరిన మొదటి భారతీయ అంతర్జాతీయ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్.
  11. ఇండిగో (IndiGo) CEO: ఆగస్టు 2026 నుండి ఇండిగో నూతన CEOగా విల్లే వాల్ష్ బాధ్యతలు చేపట్టనున్నారు.
  12. అరబ్ లీగ్ సెక్రటరీ జనరల్: అరబ్ లీగ్ నూతన సెక్రటరీ జనరల్‌గా ఈజిప్ట్ మాజీ మంత్రి నబీల్ ఫహ్మీ నియమితులయ్యారు.
  13. ఇండియా ఫార్మా 2026: ఈ అంతర్జాతీయ ఫార్మా కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో జరగనుంది.
  14. CMS COP 15: వలస పక్షుల పరిరక్షణపై 15వ పార్టీల సమావేశం బ్రెజిల్‌లోని క్యాంపొ గ్రాండేలో జరిగింది.
  15. జీరో వేస్ట్ సిటీ: ’20 సిటీస్ టువర్డ్స్ జీరో వేస్ట్’ గ్లోబల్ ఇనిషియేటివ్ కింద కేరళలోని వర్కాల నగరం ఎంపికైంది.
  16. కొత్త జాతి కప్ప: ‘నెక్ బెట్రాచస్ కాళీ’ అనే కొత్త జాతి కప్పను శాస్త్రవేత్తలు కర్ణాటక రాష్ట్రంలో కనుగొన్నారు.
  17. ఉత్కల్ దివస్: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న ఒడిశా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని (ఉత్కల్ దివస్) జరుపుకుంటారు.
  18. నవేగావ్ నాగ్‌జైరా టైగర్ రిజర్వ్: ఈ ప్రసిద్ధ టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది.
  19. శీతలా మాత ఆలయం: ఇటీవల తొక్కిసలాట జరిగిన ఈ ప్రసిద్ధ ఆలయం బీహార్ (నలంద జిల్లా)లో ఉంది.
  20. మాధోపూర్ మేళా 2026: ఈ సాంప్రదాయక మేళా ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించబడింది.
  21. చంద్రికా ప్రసాద్ సంతో: ఇటీవల మరణించిన ఈయన సూరీనామ్ దేశానికి మాజీ అధ్యక్షుడిగా పనిచేశారు.
  22. విజయ్‌పత్ సింఘానియా: ఇటీవల కన్నుమూసిన ఈ ప్రముఖ పారిశ్రామికవేత్త రేమండ్ గ్రూప్ మాజీ అధ్యక్షుడు.
  23. ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ: లండన్‌లో ఈ సంస్థను మరియు ఇండియా హౌస్‌ను స్థాపించిన వారు శ్యామ్ జీ కృష్ణ వర్మ.
  24. అనువాదిని AI: ఆయుర్వేద పరిశోధనలను 13 ప్రాంతీయ భాషల్లోకి అనువదించడానికి CCRAS సంస్థ అనువాదిని AIతో ఒప్పందం చేసుకుంది.
  25. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2026: ఈ క్రీడలు మంగోలియా రాజధాని ఉలాన్ బాటర్లో నిర్వహించబడుతున్నాయి.

Practice Test April 1st 2026 Current Affairs Quiz

[srmt_list title=”Latest Current Affairs quiz” cat=”current-affairs” limit=”5″]

👉 ప్రతి రోజు Current Affairs కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి
👉 మీ ఫ్రెండ్స్‌తో ఈ పోస్ట్‌ను షేర్ చేయండి
👉 మరిన్ని GK Bits కోసం Follow అవ్వండి

Latest Test Series

Today Current Affairs START TEST
Previous Papers Previous papers
Geography Geography
Biography Biography
Awards & Honors Awards
History History

Discover more from SRMTUTORS

Subscribe to get the latest posts sent to your email.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now