TGPSC Group-4 Merit List Out

0
TGPSC Group-4 Merit List out

TGPSC Group-4 Merit List Out తెలంగాణ గ్రూప్-4 మెరిట్ జాబితా విడుదల రాష్ట్రంలో ఎంపికైన అభ్యర్థులు ఈనెల 13 నుంచి వెబ్‌ ఆప్షన్స్‌ TSPSC official Website

ఎంపికైన అభ్యర్థులు ఈనెల 13 నుంచి వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేసుకునేందుకు కమిషన్‌ అవకాశం కల్పించింది. 

రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలకమైన ధ్రువపత్రాల పరిశీలనకు టీజీపీఎస్సీ తేదీని ఖరారు చేసింది

TGPSC Group-4 Merit List Out

తెలంగాణ గ్రూప్-4 ధ్రువపత్రాల వెరిఫికేషన్కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను TGPSC విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు చెకింగ్ లిస్ట్లో పాటు 2 కాపీల చొప్పున అప్లికేషన్ ఫామ్, వెబ్సైట్లో ఉండే అటెస్టేషన్ ఫామ్ను వెరిఫికేషన్కు తీసుకురావాలని సూచించింది. ఈనెల 13 నుంచి వెబ్ ఆప్షన్ లింక్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. నాంపల్లిలోని TGPSC ఆఫీస్, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో వెరిఫికేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది.

ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేసుకోవాలని సూచించింది. వారిని మాత్రమే విడతల వారీగా ధ్రువపత్రాల పరిశీలనకు అనుమతిస్తామని పేర్కొంది. అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సిన రోజువారీ తేదీలను కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెలిపింది.

వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు కింది సర్టిఫికెట్లను తప్పనిసరిగా సిద్ధంగా ఉంచుకోవాలి.
1) చెక్‌లిస్ట్-అభ్యర్థి పూరించాల్సిన ప్రాథమిక సమాచార డేటా (చెక్‌లిస్ట్‌ని కమిషన్ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు).
2) సమర్పించిన దరఖాస్తు (PDF) (కమీషన్ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు) (02 కాపీలు).
3) హాల్ టికెట్.
4) పుట్టిన తేదీ సర్టిఫికేట్ (SSC మెమో).
5) 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు పాఠశాల స్టడీ సర్టిఫికేట్ లేదా నివాసం/నేటివిటీ సర్టిఫికేట్ (అభ్యర్థి పాఠశాలలో చదవకపోయినా ప్రైవేట్‌గా లేదా ఓపెన్ స్కూల్‌లో చదువుకున్నప్పుడు)

గమనిక: సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రోజు వారీ షెడ్యూల్ తర్వాత కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాల కోసం కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.