Home » Current Affairs Quiz » Daily Current Affairs 23rd June 2026 Quiz in Telugu | MCQs for APPSC, TGPSC, SSC, Railway

Daily Current Affairs 23rd June 2026 Quiz in Telugu | MCQs for APPSC, TGPSC, SSC, Railway

On: శుక్రవారం, జూన్ 26, 2026 5:45 సా.
June 23rd Current Affairs 2026

Daily Current Affairs 23rd June 2026 Quiz | UPSC, APPSC, TGPSC, SSC, RAILWAY, BANKING Telugu GK Daily Current Affairs Quiz, Today Current Affairs

23rd June 2026 Important Current Affairs in Telugu for all upcoming exams

జూన్23, 2026 నాటి Daily Current Affairs MCQ Quiz ను తెలుగు లో ఇక్కడ అందిస్తున్నాము. APPSC, TGPSC, SSC, Railway, Banking మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు మరియు వివరణలు ఇందులో ఉన్నాయి.

ఈ రోజు Current Affairsలో ఉన్న ముఖ్యమైన అంశాలు

  • జాతీయ అంశాలు & ప్రభుత్వ పథకాలు (National Affairs & schemes)
  • ప్రాంతీయ అంశాలు (State Specific)
  • స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్(Sports Current Affairs quiz)
  • సైన్స్, టెక్నాలజీ & రక్షణ ( Science, Tech & Defence)
  • అంతర్జాతీయ అంశాలు (International Affairs)
  • బ్యాంకింగ్ & నియామకాలు (Banking & Appointments)

ఈ క్విజ్ SSC, RRB, APPSC, TSPSC, బ్యాంకింగ్ మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు చాలా ఉపయోగపడుతుంది.

on this day in History May 20

Daily Current Affairs June 23rd, 2026, Quiz

జూన్ 23rd, 2026 నాటి Daily Current Affairs MCQ Quiz.
APPSC, TGPSC, SSC, Railway, Banking exams కోసం ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు.

23rd June 2026 Current Affairs Quiz

Daily Current Affairs June 23rd, 2026, Quiz

Daily Current Affairs

1. ప్రశ్న: ఫార్మల్ సెక్టార్‌లో (Formal Sector) కొత్త ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించడానికి ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ పథకం పేరు ఏమిటి?

A) ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన

B) ప్రధాన మంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY)

C) ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన

D) యువ శక్తి యోజన

సరైన సమాధానం:

B) ప్రధాన మంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన, వివరణ: ప్రధాని మోదీ ఇటీవల ఈ పథకం కింద రూ. 2400 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేశారు. ఇది కొత్త కార్మికుల ఈపీఎఫ్ఓ (EPFO) నమోదును మరియు సామాజిక భద్రతా కవరేజీని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.


2. ప్రశ్న: ఇటీవల కోల్‌కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్‌లో ఏ మూడు స్వదేశీ యుద్ధనౌకలను భారత నౌకాదళంలోకి చేర్చారు?

A) ఐఎన్‌ఎస్ విక్రాంత్, ఐఎన్‌ఎస్ తల్వార్ మరియు ఐఎన్‌ఎస్ సహ్యాద్రి

B) ఐఎన్‌ఎస్ దూనాగిరి, ఐఎన్‌ఎస్ సంశోధక్ మరియు ఐఎన్‌ఎస్ అగ్రయ్

C) ఐఎన్‌ఎస్ కిల్తాన్, ఐఎన్‌ఎస్ కమోర్టా మరియు ఐఎన్‌ఎస్ కద్మత్

D) ఐఎన్‌ఎస్ వేలా, ఐఎన్‌ఎస్ వాగిర్ మరియు ఐఎన్‌ఎస్ వగీర్

సరైన సమాధానం:

B) ఐఎన్‌ఎస్ దూనాగిరి, ఐఎన్‌ఎస్ సంశోధక్ మరియు ఐఎన్‌ఎస్ అగ్రయ్, వివరణ: ప్రధాని మోదీ వీటిని ప్రారంభించారు. ఐఎన్‌ఎస్ దూనాగిరి ఒక స్టీల్త్ ఫ్రిగేట్, సంశోధక్ సర్వే వెసల్ మరియు అగ్రయ్ ఒక యాంటీ-సబ్ మెరైన్ వార్‌ఫేర్ క్రాఫ్ట్. వీటిని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ నిర్మించారు.


3. ప్రశ్న: హిమాలయ ప్రాంతంలో వాతావరణ మార్పులను పర్యవేక్షించడానికి ‘భారత్ క్లైమేట్ అబ్జర్వేషన్ నెట్‌వర్క్’ (BCON) ప్రాజెక్టును ఏ సంస్థ రూపొందించింది?

A) ఐఐటీ ఢిల్లీ

B) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ (IITM)

C) ఇస్రో (ISRO)

D) టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్

సరైన సమాధానం:

B) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ, వివరణ: కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐఐటీఎం (పూణే) ఈ నెట్‌వర్క్‌ను రూపొందించింది. దీని కోసం నైనిటాల్‌లోని ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ARIES)తో ఒప్పందం కుదిరింది.


4. ప్రశ్న: మహిళల భద్రత, గౌరవం మరియు హక్కులపై ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించే ‘నిర్భయ చేతనా’ (Nirbhaya Chetna) చొరవను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?

A) మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

B) కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

C) కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ

D) సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ

సరైన సమాధానం:

C) కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, వివరణ: ‘నిర్భయ ఫండ్’ ప్రాజెక్టులో భాగంగా పురుష ప్రజా ప్రతినిధులలో లింగ సున్నితత్వం పట్ల అవగాహన కల్పించడానికి ఈ 3 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఢిల్లీలో నిర్వహించారు.


5. ప్రశ్న: చైనా నుండి పెరుగుతున్న సైనిక ఒత్తిడిని ఎదుర్కోవడానికి ‘ఇమ్మీడియట్ కాంబాట్ రెడీనెస్ ఎక్సర్‌సైజ్’ (Immediate Combat Readiness Exercise) పేరుతో 5 రోజుల యుద్ధ విన్యాసాలను ఏ దేశం చేపట్టింది?

A) జపాన్

B) ఫిలిప్పీన్స్

C) తైవాన్

D) వియత్నాం

సరైన సమాధానం:

C) తైవాన్, వివరణ: జూన్ 22 నుండి 26, 2026 వరకు తైవాన్ అంతటా ఈ రక్షణ విన్యాసాలు నిర్వహించబడతాయి. శత్రువుల దాడిని తక్షణమే తిప్పికొట్టేలా తమ దళాలను సిద్ధం చేయడం దీని లక్ష్యం.


6. ప్రశ్న: లిస్ట్ ఏ (List A) క్రికెట్ చరిత్రలో కేవలం 11 బంతుల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ (Fastest 50) సాధించిన భారతీయ క్రికెటర్ ఎవరు?

A) సూర్యకుమార్ యాదవ్

B) ఇషాన్ కిషన్

C) వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)

D) శుభ్‌మన్ గిల్

సరైన సమాధానం:

C) వైభవ్ సూర్యవంశీ, వివరణ: వైభవ్ సూర్యవంశీ కేవలం 11 బంతుల్లోనే 50 పరుగుల మైలురాయిని చేరుకుని భారత క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించారు.


7. ప్రశ్న: లండన్‌లోని ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’ (House of Lords) లో ఇటీవల నిర్వహించబడిన సదస్సు ఏది?

A) గ్లోబల్ క్లైమేట్ సమ్మిట్

B) వికసిత భారత్ 2047 ఫోరమ్

C) భారత్-బ్రిటన్ ట్రేడ్ కౌన్సిల్

D) కామన్వెల్త్ స్పీకర్ల సమావేశం

సరైన సమాధానం:

B) వికసిత భారత్ 2047 ఫోరమ్, వివరణ: 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యాన్ని మరియు భారత్-యూకే సంబంధాలను చర్చించడానికి ఈ ఫోరమ్ వేదికైంది.


8. ప్రశ్న: వేలిముద్రల (Fingerprints) ఆధారంగా కేవలం 35 సెకన్లలో నేరస్థులను గుర్తించగల ‘అభిజ్ఞాన్’ (Abhigyaan) యాప్‌ను ఎవరు ప్రారంభించారు?

A) నరేంద్ర మోదీ

B) అమిత్ షా

C) రాజ్‌నాథ్ సింగ్

D) అశ్వినీ వైష్ణవ్

సరైన సమాధానం:

B) అమిత్ షా, వివరణ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనిని ప్రారంభించారు. ఇది 1.30 కోట్లకు పైగా నేరస్థుల డేటాను కలిగి ఉన్న నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్‌ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (NAFIS) తో అనుసంధానించబడింది.


9. ప్రశ్న: అంతర్జాతీయ పురుషులు మరియు మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో 200 మ్యాచ్‌లు ఆడిన ప్రపంచపు మొట్టమొదటి ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు?

A) రోహిత్ శర్మ

B) విరాట్ కోహ్లీ

C) హర్మన్‌ప్రీత్ కౌర్

D) సూజీ బేట్స్

సరైన సమాధానం:

C) హర్మన్‌ప్రీత్ కౌర్, వివరణ: భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, 2026 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ అరుదైన ఘనత సాధించారు.


10. ప్రశ్న: విడిభాగాల (Spare parts) కోసం 9 రిటైర్డ్ జాగ్వార్ (Jaguar) యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భారత వైమానిక దళం ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది?

A) ఫ్రాన్స్

B) బ్రిటన్ (UK)

C) అమెరికా

D) రష్యా

సరైన సమాధానం:

B) బ్రిటన్, వివరణ: జాగ్వార్ విమానాల తయారీ నిలిచిపోయినందున, ప్రస్తుతం భారత దళంలో ఉన్న విమానాల నిర్వహణ కోసం బ్రిటన్ రిటైర్ చేసిన పాత విమానాల నుండి విడిభాగాలను భారత్ సేకరించనుంది.


11. ప్రశ్న: ప్రతి ఏటా ‘అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం’ (International Olympic Day) ఏ రోజున జరుపుకుంటారు?

A) జూన్ 20

B) జూన్ 21

C) జూన్ 22

D) జూన్ 23

సరైన సమాధానం

: D) జూన్ 23, వివరణ: 1894 జూన్ 23న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ఏర్పాటుకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు.


12. ప్రశ్న: ఫుట్‌బాల్ ప్రపంచ కప్ (FIFA World Cup) చరిత్రలో అత్యధికంగా 18 గోల్స్ చేసిన క్రీడాకారుడిగా ఎవరు రికార్డు సృష్టించారు?

A) క్రిస్టియానో రొనాల్డో

B) లియోనెల్ మెస్సీ (Lionel Messi)

C) ఎంబాపె

D) నెయమార్

సరైన సమాధానం:

B) లియోనెల్ మెస్సీ, వివరణ: అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ ప్రపంచ కప్ పోటీల్లో 18 గోల్స్‌తో అగ్రస్థానానికి చేరుకున్నారు.


13. ప్రశ్న: భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ అధ్యక్షతన ఇటీవల ‘బ్రిక్స్ (BRICS) భద్రతా సదస్సు’ ఎక్కడ జరిగింది?

A) మాస్కో

B) బీజింగ్

C) న్యూ ఢిల్లీ

D) కేప్ టౌన్

సరైన సమాధానం:

C) న్యూ ఢిల్లీ, వివరణ: బ్రిక్స్ దేశాల మధ్య భద్రతా సహకారం మరియు ఉగ్రవాద వ్యతిరేక చర్యల గురించి చర్చించడానికి న్యూ ఢిల్లీలో ఈ కీలక సమావేశం జరిగింది.


14. ప్రశ్న: ‘ఇండియన్ అథ్లెటిక్స్ అవార్డ్స్ 2025’ లో ‘బెస్ట్ ఫీమేల్ అథ్లీట్ ఆఫ్ ది ఇయర్’ గా ఎవరు ఎంపికయ్యారు?

A) పి.టి. ఉష

B) పారుల్ చౌదరి (Parul Chaudhary)

C) అంజూ బాబీ జార్జ్

D) జ్యోతి యర్రాజీ

సరైన సమాధానం:

B) పారుల్ చౌదరి, వివరణ: 2025 సంవత్సరంలో కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శనలకు గాను పారుల్ చౌదరి ఈ అవార్డు అందుకున్నారు. పురుషుల విభాగంలో నీరజ్ చోప్రా విజేతగా నిలిచారు.


15. ప్రశ్న: భారతదేశం నుండి యూరోపియన్ దేశమైన ఆస్ట్రియాకు (Austria) ఎగ్ పౌడర్ (Egg Powder) ఎగుమతి చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది?

A) ఆంధ్రప్రదేశ్

B) తమిళనాడు

C) ఒడిశా

D) పంజాబ్

సరైన సమాధానం:

C) ఒడిశా, వివరణ: ఒడిశా తన మొట్టమొదటి ఎగ్ పౌడర్ కన్సైన్‌మెంట్‌ను ఆస్ట్రియాకు పంపడం ద్వారా అంతర్జాతీయ ఎగుమతుల్లో కొత్త మైలురాయిని చేరుకుంది.


16. ప్రశ్న: ‘ఏషియన్ రిలే ఛాంపియన్‌షిప్ 2026’ లో మహిళల 4×100 మీటర్ల రిలే లో ఏ దేశం బంగారు పతకం సాధించింది?

A) చైనా

B) భారతదేశం

C) జపాన్

D) దక్షిణ కొరియా

సరైన సమాధానం:

B) భారతదేశం, వివరణ: భారత మహిళా అథ్లెట్ల బృందం ఈ అంతర్జాతీయ పోటీలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.


17. ప్రశ్న: న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రతిష్టాత్మక ‘స్కాచ్ అవార్డు’ (Scotch Award) అందుకున్న సరిహద్దు జిల్లా ఏది?

A) రాజౌరి

B) పూంచ్ (Poonch)

C) లడఖ్

D) జైసల్మేర్

సరైన సమాధానం:

B) పూంచ్, వివరణ: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లా తన పరిపాలనా పనితీరుకు గాను ఈ జాతీయ గౌరవాన్ని పొందింది.


18. ప్రశ్న: బ్రిటన్ (UK) ప్రధాన మంత్రి పదవికి ఇటీవల రాజీనామా ప్రకటించిన కీర్ స్టార్మర్ (Keir Starmer) ఏ రాజకీయ పార్టీకి చెందినవారు?

A) కన్జర్వేటివ్ పార్టీ

B) లేబర్ పార్టీ (Labour Party)

C) లిబరల్ డెమోక్రాట్స్

D) గ్రీన్ పార్టీ

సరైన సమాధానం:

B) లేబర్ పార్టీ ,వివరణ: యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన లేబర్ పార్టీ నాయకత్వం వహించారు

June 2026 Current Affairs PDF

Latest Test Series

Today Current Affairs START TEST
Previous Papers Previous papers
Geography Geography
Biography Biography
Awards & Honors Awards
History History

Discover more from SRMTUTORS

Subscribe to get the latest posts sent to your email.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment