Daily Current Affairs 27th June 2026 Quiz | UPSC, APPSC, TGPSC, SSC, RAILWAY, BANKING Telugu GK Daily Current Affairs Quiz, Today Current Affairs
27th June 2026 Important Current Affairs in Telugu for all upcoming exams
జూన్27, 2026 నాటి Daily Current Affairs MCQ Quiz ను తెలుగు లో ఇక్కడ అందిస్తున్నాము. APPSC, TGPSC, SSC, Railway, Banking మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు మరియు వివరణలు ఇందులో ఉన్నాయి.
ఈ రోజు Current Affairsలో ఉన్న ముఖ్యమైన అంశాలు
- జాతీయ అంశాలు & ప్రభుత్వ పథకాలు (National Affairs & schemes)
- ప్రాంతీయ అంశాలు (State Specific)
- స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్(Sports Current Affairs quiz)
- సైన్స్, టెక్నాలజీ & రక్షణ ( Science, Tech & Defence)
- అంతర్జాతీయ అంశాలు (International Affairs)
- బ్యాంకింగ్ & నియామకాలు (Banking & Appointments)
ఈ క్విజ్ SSC, RRB, APPSC, TSPSC, బ్యాంకింగ్ మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు చాలా ఉపయోగపడుతుంది.
Daily Current Affairs June 27th, 2026, Quiz
జూన్ 27th, 2026 నాటి Daily Current Affairs MCQ Quiz.
APPSC, TGPSC, SSC, Railway, Banking exams కోసం ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు.
14th June 2026 Current Affairs Quiz
Daily Current Affairs June 27th, 2026, Quiz
1. ఇటీవల భారీ భూకంపంతో అతలాకుతలమైన వెనిజులాకు సాయం చేయడానికి భారతదేశం ప్రారంభించిన సహాయక చర్యల పేరు ఏమిటి?
A) ఆపరేషన్ దోస్త్
B) ఆపరేషన్ అమస్తాద్ (Operation Amistad)
C) ఆపరేషన్ కరుణ
D) ఆపరేషన్ గంగా
సమాధానం:
B) ఆపరేషన్ అమస్తాద్, వివరణ: ‘అమస్తాద్’ అనేది స్పానిష్ పదం, దీని అర్థం ‘స్నేహం’. వెనిజులాలో సంభవించిన 7.2 మరియు 7.5 తీవ్రత గల భూకంప బాధితుల కోసం భారత్ రెండు సి-17 గ్లోబ్‌మాస్టర్ విమానాల్లో మందులు, వైద్య బృందాలు మరియు ‘భీష్మ క్యూబ్’ (పోర్టబుల్ ఆసుపత్రి)ని పంపింది.
2. జూన్ 2026లో విడుదలైన ప్రపంచ టాప్ 500 సూపర్ కంప్యూటర్ల జాబితాలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ గా ఏది నిలిచింది?
A) ఫ్రంటియర్ (అమెరికా)
B) లైన్-షైన్ (LineShine – చైనా)
C) ఎల్ కాపిటన్ (అమెరికా)
D) ఎరావత్ (భారతదేశం)
సరైన సమాధానం:
B) లైన్-షైన్, వివరణ: చైనాకు చెందిన ‘లైన్-షైన్’ సెకనుకు 2.198 ఎక్సాఫ్లాప్స్ వేగంతో ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఇది అమెరికాకు చెందిన ‘ఎల్ కాపిటన్’ను వెనక్కి నెట్టింది. భారత్ కు చెందిన ‘శక్తి క్లౌడ్’ 32వ స్థానంలో నిలిచింది.
3. ప్రశ్న: ప్రాచీన భారతీయ శస్త్రచికిత్స పితామహుడు మహర్షి సుశ్రుతుడి 90 కిలోల కాంస్య విగ్రహాన్ని ఇటీవల ఏ దేశంలో ఆవిష్కరించారు?
A) అమెరికా
B) స్కాట్లాండ్ (ఎడిన్బర్గ్)
C) ఆస్ట్రేలియా
D) జర్మనీ
సరైన సమాధానం:
B) స్కాట్లాండ్, వివరణ: స్కాట్లాండ్ లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ లో సుశ్రుతుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. శస్త్రచికిత్స మరియు ప్లాస్టిక్ సర్జరీ రంగాలకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని తమిళనాడుకు చెందిన రాఘవంతిం స్థాపతి రూపొందించారు.
4. ప్రశ్న: భారత నిఘా విభాగం ‘ఇంటెలిజెన్స్ బ్యూరో’ (IB) నూతన డైరెక్టర్ గా జూన్ 2026లో ఎవరు నియమితులయ్యారు?
A) తపన్ కుమార్ దేకా
B) మహేష్ దీక్షిత్ (Mahesh Dixit)
C) ప్రవీణ్ సూద్
D) రాహుల్ వత్స్
సరైన సమాధానం:
B) మహేష్ దీక్షిత్, వివరణ: 1993 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి మహేష్ దీక్షిత్ ఐబీ నూతన డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఆయన తపన్ కుమార్ దేకా స్థానంలో బాధ్యతలు చేపడతారు.
5. ప్రశ్న: ప్రతి ఏటా ‘ప్రపంచ MSME దినోత్సవం’ (World MSME Day) ఏ రోజున జరుపుకుంటారు?
A) జూన్ 21
B) జూన్ 25
C) జూన్ 27
D) జూన్ 30
సరైన సమాధానం:
C) జూన్ 27, వివరణ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల (MSMEs) ప్రాముఖ్యతను గుర్తించడానికి ప్రతి ఏటా జూన్ 27న ఈ దినోత్సవం నిర్వహిస్తారు.
6.: త్రిపుర రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇటీవల ‘అనానస్ (పైనాపిల్) ఉత్సవం 2026’ ను ఎక్కడ నిర్వహించింది?
A) అగర్తలా
B) న్యూ ఢిల్లీ
C) కోల్‌కతా
D) గౌహతి
సమాధానం:
B) న్యూ ఢిల్లీ, వివరణ: త్రిపురకు చెందిన ‘క్వీన్ పైనాపిల్’ రకాన్ని ప్రోత్సహించడానికి న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించారు.
7. ప్రశ్న: ఇటీవల ఆస్ట్రేలియాలో కనుగొనబడిన ‘బాలెస్టా స్పైడర్’ (Balesta Spider) అనేది దేనికి సంబంధించిన నూతన జాతి?
A) పాము
B) సాలీడు
C) కప్ప
D) బల్లి
సమాధానం:
B) సాలీడు, వివరణ: ఆస్ట్రేలియాలోని శాస్త్రవేత్తలు సాలీడులలో ఒక కొత్త జాతిని గుర్తించి దానికి ‘బాలెస్టా స్పైడర్’ అని పేరు పెట్టారు.
8. 12వ భారత్ – యూరోపియన్ యూనియన్ (EU) మానవ హక్కుల సమావేశం’ ఇటీవల ఏ నగరంలో జరిగింది?
A) బ్రస్సెల్స్
B) న్యూ ఢిల్లీ
C) పారిస్
D) జెనీవా
సరైన సమాధానం:
B) న్యూ ఢిల్లీ, వివరణ: మానవ హక్కుల పరిరక్షణ మరియు ద్వైపాక్షిక సహకారంపై చర్చించడానికి భారత్ మరియు ఈయూ ప్రతినిధులు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
9. ప్రశ్న: ఉరుగ్వే (Uruguay) లో భారత రాయబారిగా (Ambassador) ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
A) విక్రమ్ దురైస్వామి
B) డాక్టర్ బెనోయ్ జార్జ్ (Dr. Benoy George)
C) రుద్ర గౌరవ్ శ్రేష్ఠ్
D) అనిల్ కాంత్ మిశ్రా
సరైన సమాధానం:
B) డాక్టర్ బెనోయ్ జార్జ్, వివరణ: కేంద్ర ప్రభుత్వం డాక్టర్ బెనోయ్ జార్జ్ ను ఉరుగ్వే దేశానికి భారత రాయబారిగా నియమించింది.
10. ప్రశ్న: కేంద్ర బడ్జెట్ 2026-27 లో ప్రభుత్వం కొత్తగా ఎన్ని బుల్లెట్ రైలు కారిడార్లను (High-Speed Rail Corridors) ప్రకటించింది?
A) 5
B) 7
C) 10
D) 12
సరైన సమాధానం:
B) 7, వివరణ: దేశవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచడానికి బడ్జెట్ లో 7 కొత్త బుల్లెట్ రైలు కారిడార్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిలో ఢిల్లీ-వారణాసి, హైదరాబాద్-బెంగళూరు వంటి మార్గాలు ఉన్నాయి.
11. హురున్ ఇండియా 500 (Hurun India 500) నివేదిక 2026 ప్రకారం భారతదేశంలో అత్యంత విలువైన కంపెనీ ఏది?
A) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
B) రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries)
C) టీసీఎస్ (TCS)
D) భారతీ ఎయిర్‌టెల్
సరైన సమాధానం:
B) రిలయన్స్ ఇండస్ట్రీస్, వివరణ: సుమారు రూ. 19.36 ట్రిలియన్ల మార్కెట్ విలువతో రిలయన్స్ మొదటి స్థానంలో ఉండగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రెండో స్థానంలో నిలిచింది.
Most Important GK Bits for all Competitive Exams
12. ప్రతి ఏటా జూన్ 22 నుండి 26 వరకు నిర్వహించబడే అస్సాం రాష్ట్రపు అతిపెద్ద మతపరమైన వేడుక ఏది?
A) బిహు ఉత్సవం
B) అంబుబాచి మేళా (Ambubachi Mela)
C) మాఘి మేళా
D) హెమిస్ మేళా
సరైన సమాధానం:
B) అంబుబాచి మేళా గౌహతిలోని కామాఖ్య దేవి ఆలయంలో అమ్మవారి వార్షిక ఋతుక్రమం సందర్భంగా ఈ మేళా నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తులకు ‘రక్త వస్త్రం’ (ఎరుపు రంగు గుడ్డ) ప్రసాదంగా ఇస్తారు
June 2026 Current Affairs PDF
Latest Test Series
Follow Us Daily Updates
Discover more from SRMTUTORS
Subscribe to get the latest posts sent to your email.









