aily Current Affairs 23rd February 2026 MCQ Quiz in Telugu డెయిలీ కరెంట్ అఫ్ఫైర్స్, Important news for all competitive exam’s current affairs 2026.
World Day of Social Justice Day, AI Mate White Paper, Zomi National Day more news
Practice Daily Current Affairs 23rd February 2026 MCQ Quiz in Telugu. Updated questions with answers for SSC, RRB, APPSC, TSPSC and all competitive exams. Free online practice test at SRMTUTORS.
Attempt 21st February 2026 Daily Current Affairs Quiz in Telugu with important MCQs and answers. Best practice test for SSC, RRB, APPSC, TSPSC & competitive exams.
Daily Current Affairs 23rd February 2026 MCQ
I. ముఖ్యమైన రోజులు (Important Days)
ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం (World Day of Social Justice) ఏ రోజున జరుపుకుంటారు?
A) ఫిబ్రవరి 18
B) ఫిబ్రవరి 19
C) ఫిబ్రవరి 20
D) ఫిబ్రవరి 21
సమాధానం:
C) ఫిబ్రవరి 20
వివరణ: సామాజిక అభివృద్ధి మరియు న్యాయం పట్ల నిబద్ధతను చాటుతూ ప్రతి ఏటా ఫిబ్రవరి 20న ఈ రోజును పాటిస్తారు. 2026 థీమ్: “Renewed commitment to Social Development and Social Justice”.
వరల్డ్ పీస్ అండర్స్టాండింగ్ డే (World Peace and Understanding Day) ఏ రోజున నిర్వహిస్తారు?
A) ఫిబ్రవరి 21
B) ఫిబ్రవరి 22
C) ఫిబ్రవరి 23
D) ఫిబ్రవరి 24
సమాధానం:
C) ఫిబ్రవరి 23
వివరణ: 1905 ఫిబ్రవరి 23న చికాగోలో రోటరీ క్లబ్ స్థాపించబడిన జ్ఞాపకార్థం ఈ రోజును ప్రపంచ శాంతి దినోత్సవంగా జరుపుకుంటారు.
అరుణాచల్ ప్రదేశ్ మరియు మిజోరాం రాష్ట్రాలు ఏ రోజున తమ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటాయి?
A) జనవరి 21
B) ఫిబ్రవరి 15
C) ఫిబ్రవరి 20
D) మార్చి 1
సమాధానం:
C) ఫిబ్రవరి 20
వివరణ: 1987 ఫిబ్రవరి 20న అరుణాచల్ ప్రదేశ్ (24వ రాష్ట్రం) మరియు మిజోరాం (23వ రాష్ట్రం) భారతదేశంలో పూర్తి స్థాయి రాష్ట్రాలుగా అవతరించాయి.
జాతీయ వార్తలు (National News)
‘AI Mate White Paper’ను ఏ సదస్సులో ఆవిష్కరించారు?
A) గ్లోబల్ టెక్ సమ్మిట్
B) ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026
C) డిజిటల్ ఇండియా కాన్ఫరెన్స్
D) నేషనల్ AI మిషన్
సమాధానం:
B) ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026
వివరణ: తయారీ మరియు ఇంజనీరింగ్ రంగంలో AIని అనుసంధానించే వ్యూహాత్మక ప్రణాళికతో అశ్విని వైష్ణవ్ గారు దీనిని విడుదల చేశారు.
‘ఇండో-ఫ్రెంచ్ సెంటర్ ఫర్ AI ఇన్ హెల్త్’ ఎక్కడ ప్రారంభించబడింది?
A) ఎయిమ్స్ ఢిల్లీ
B) ఎయిమ్స్ భోపాల్
C) ఐఐటి బాంబే
D) జిప్మర్ పుదుచ్చేరి
సమాధానం:
A) ఎయిమ్స్ ఢిల్లీ
వివరణ: ఆరోగ్య రంగంలో సాంకేతిక సహకారం కోసం భారత్-ఫ్రాన్స్ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని ఎయిమ్స్ ఢిల్లీలో ఏర్పాటు చేశాయి.
‘6వ నేషనల్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్’ ఏ నదిపై నిర్వహించబడింది?
A) గంగా నది
B) తీస్తా నది
C) చీనాబ్ నది
D) బియాస్ నది
సమాధానం:
C) చీనాబ్ నది
వివరణ: జమ్మూ కాశ్మీర్‌లోని డోడా జిల్లాలో చీనాబ్ నదిపై ‘ది అల్టిమేట్ రివర్ బ్యాటిల్’ పేరుతో ఈ పోటీలు జరిగాయి.
78వ ‘జోమీ నేషనల్ డే’ (Zomi National Day) ఏ జిల్లాలో జరిగింది?
A) చురాచంద్పూర్ (మణిపూర్)
B) ఉఖ్రుల్ (మణిపూర్)
C) కోహిమా (నాగాలాండ్)
D) ఐజ్వాల్ (మిజోరాం)
సమాధానం:
A) చురాచంద్పూర్
వివరణ: మణిపూర్‌లోని చురాచంద్పూర్ జిల్లాలో జోమీ కమ్యూనిటీ తమ 78వ జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంది.
భారతదేశపు మొట్టమొదటి ‘యూరోపియన్ లీగల్ గేట్‌వే ఆఫీస్’ ఎక్కడ ప్రారంభమైంది?
A) ముంబై
B) చెన్నై
C) న్యూఢిల్లీ
D) బెంగళూరు
సమాధానం:
C) న్యూఢిల్లీ
వివరణ: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సమక్షంలో యూరోపియన్ యూనియన్ సహకారంతో ఈ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించారు.
‘వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రామ్’ (Vibrant Village Program) రెండవ దశ ఎక్కడ ప్రారంభమైంది?
A) అరుణాచల్ ప్రదేశ్
B) సిక్కిం
C) అస్సాం
D) మేఘాలయ
సమాధానం:
C) అస్సాం
వివరణ: సరిహద్దు గ్రామాల్లో అభివృద్ధి కోసం అస్సాం లోని నతన్‌పూర్ గ్రామంలో అమిత్ షా దీనిని ప్రారంభించారు.
ఇటీవల వార్తల్లో నిలిచిన ‘INS అరిధమన్’ ఏ రకమైన యుద్ధ నౌక?
A) కల్వరి క్లాస్
B) అరిహంత్ క్లాస్
C) సింధుఘోష్ క్లాస్
D) శివాలిక్ క్లాస్
సమాధానం:
B) అరిహంత్ క్లాస్ అణు సామర్థ్యం గల బాలిస్టిక్ మిసైల్ జలాంతర్గామి (SSBN)
వివరణ: ఇది భారతదేశపు మూడవ స్వదేశీ అణు సామర్థ్యం గల బాలిస్టిక్ మిసైల్ జలాంతర్గామి.
బీహార్‌లో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ నిర్మించనున్నారు?
A) పాట్నా
B) సోన్పూర్ (సారణ్ జిల్లా)
C) దర్భంగా
D) గయ
సమాధానం:
B) సోన్పూర్
వివరణ: బీహార్ ప్రభుత్వం సోన్‌పూర్‌లో భారీ విమానాలను (Airbus A380 వంటివి) హ్యాండిల్ చేయగల సామర్థ్యంతో బీహార్ ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది.
హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన అంతర్జాతీయ ఉద్యాన ప్రదర్శనలో ప్రథమ బహుమతి ఏ రాష్ట్రానికి లభించింది?
A) తెలంగాణ
B) హర్యానా
C) కర్ణాటక
D) తమిళనాడు
సమాధానం:
A) తెలంగాణ హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన అంతర్జాతీయ ఉద్యాన ప్రదర్శనలో తెలంగాణ స్టాలు ప్రథమబహుమతి లభించింది. ఈ నెల 19న ప్రారంభమైన ప్రదర్శన శనివారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఉత్తమ డిజైన్, ఉత్పత్తుల ప్రదర్శన విభాగంలో తెలంగాణ స్టాల్‌ను మొదటి స్థానానికి ఎంపిక చేశారు. హరియాణా వ్యవ సాయ శాఖ మంత్రి శ్యామ్ సింగ్ రాణా తెలంగాణ అధి కారులకు బహుమతి అందజేశారు
అంతర్జాతీయ వార్తలు (International News)
భారత్ ఇటీవల ఏ వ్యూహాత్మక ఒప్పందంపై సంతకం చేసింది?
A) క్వాడ్ ఎనర్జీ ప్యాక్ట్
B) పెక్స్ సిలికా డిక్లరేషన్
C) గ్లోబల్ సెమీకండక్టర్ అలయన్స్
D) ఇండో-పసిఫిక్ సెక్యూరిటీ డీల్
సమాధానం:
B) పెక్స్ సిలికా డిక్లరేషన్ Pex Silica Declaration
వివరణ: సెమీకండక్టర్ సప్లై చైన్ మరియు AI భద్రత కోసం అమెరికా నేతృత్వంలోని కూటమిలో భారత్ చేరింది.
IV. నియామకాలు & మరణాలు (Appointments & Obituaries)
PSPCL (పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్) డైరెక్టర్‌గా నియమితులైన మొదటి మహిళా టెక్నోక్రాట్ ఎవరు?
A) హర్షరణ్ కౌర్ తిర్హాన్
B) కిరణ్ మజుందార్ షా
C) గీతా గోపీనాథ్
D) నమితా థాపర్
సమాధానం:
A) హర్షరణ్ కౌర్ తిర్హాన్
వివరణ: పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు స్థాయికి చేరిన తొలి మహిళా ఇంజనీర్ ఈమె.
ఇటీవల మరణించిన ప్రసిద్ధ బెంగాలీ రచయిత ఎవరు?
A) అమితావ్ ఘోష్
B) మణి శంకర్ ముఖర్జీ (శంకర్)
C) శరత్ చంద్ర
D) రవీంద్రనాథ్ సేన్
సమాధానం:
B) మణి శంకర్ ముఖర్జీ
వివరణ: సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మరియు ప్రముఖ బెంగాలీ రచయిత అయిన ఈయన 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
క్రీడా వార్తలు (Sports News)
మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్ ఎవరు?
A) మిథాలీ రాజ్
B) స్మృతి మంధాన
C) హర్మన్‌ప్రీత్ కౌర్
D) సుజీ బేట్స్
సమాధానం:
C) హర్మన్‌ప్రీత్ కౌర్
వివరణ: 356 అంతర్జాతీయ మ్యాచ్‌లతో హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త రికార్డు సృష్టించారు. న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్ (355 మ్యాచ్‌లు) రికార్డును అధిగమించారు
‘మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్ ఛాంపియన్షిప్ 2026’ విజేత ఎవరు?
A) ఇండియా A
B) బంగ్లాదేశ్ A
C) పాకిస్థాన్ A
D) శ్రీలంక A
సమాధానం:
A) ఇండియా A
వివరణ: ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఇండియా A మహిళా జట్టు ఈ టైటిల్‌ను గెలుచుకుంది.
18.వింటర్ ఒలింపిక్స్‌లో ఆరు స్వర్ణాలు గెలిచిన తొలి అథ్లెట్‌గా ఎవరు ఘనత సాధించారు?
A) ఎరిక్ హెయిడెన్
B) మార్టిన్ లూవ్మ్
C) ఇవర్సెన్
D) జొహానెస్ క్లాబో
సమాధానం:
D) జొహానెస్ క్లాబో
నార్వే అథ్లెట్ జొహానెస్ క్లాబో వింటర్ ఒలింపిక్స్‌లో పురుషుల క్రాస్ కంట్రీ స్కీయింగ్ పోటీల్లో ఆరోసారి విజేతగా నిలిచి.. ఒక వింటర్ ఒలింపిక్స్‌లో ఆరు స్వర్ణాలు గెలిచిన తొలి అథ్లెట్‌గా ఘనత సాధించాడు.
latest current affairs
Latest Test Series
Follow Us Daily Updates
23rd Current Affairs Quiz
Discover more from SRMTUTORS
Subscribe to get the latest posts sent to your email.









