Home » Current Affairs Quiz » Daily Current Affairs May 17th 2026 Quiz in Telugu | MCQs for APPSC, TGPSC, SSC, Railway

Daily Current Affairs May 17th 2026 Quiz in Telugu | MCQs for APPSC, TGPSC, SSC, Railway

On: ఆదివారం, మే 17, 2026 3:29 సా.
May 17 Current Affairs

మే 17, 2026 నాటి Daily Current Affairs MCQ Quiz ను తెలుగు లో ఇక్కడ అందిస్తున్నాము. APPSC, TGPSC, SSC, Railway, Banking మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు మరియు వివరణలు ఇందులో ఉన్నాయి.

Daily Current Affairs May 17th 2026 Quiz | UPSC, APPSC, TGPSC, SSC, RAILWAY, BANKING Telugu GK Daily Current Affairs Quiz 

📌 మొత్తం ప్రశ్నలు: 15
📌 పరీక్షలు: APPSC, TGPSC, SSC, Railway
📌 Type: MCQ Quiz
📌 Language: Telugu
📌 Includes Explanations

మే 17, 2026 నాటి Daily Current Affairs MCQ Quiz.

ఈ రోజు Current Affairsలో ఉన్న ముఖ్యమైన అంశాలు

  • జాతీయ అంశాలు & ప్రభుత్వ పథకాలు (National Affairs & schemes)
  • ప్రాంతీయ అంశాలు (State Specific)
  • స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్(Sports Current Affairs quiz)
  • సైన్స్, టెక్నాలజీ & రక్షణ ( Science, Tech & Defence)
  • అంతర్జాతీయ అంశాలు (International Affairs)
  • బ్యాంకింగ్ & నియామకాలు (Banking & Appointments)

ఈ క్విజ్ SSC, RRB, APPSC, TSPSC, బ్యాంకింగ్ మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు చాలా ఉపయోగపడుతుంది.

on this day in History May 15

Daily Current Affairs May 17th 2026 Quiz

మే 16, 2026 నాటి Daily Current Affairs MCQ Quiz.
APPSC, TGPSC, SSC, Railway, Banking exams కోసం ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు.

17th May 2026 Current Affairs Quiz

ఇలాంటి Daily Current Affairs MCQs కోసం ప్రతిరోజూ SRMTUTORS.IN ని సందర్శించండి.

📌 పాలన & చట్టం (Governance & Law)

1. పంచాయతీ రాజ్ సంస్థలలో మొత్తం స్థానాల్లో 50% మహిళలకు రిజర్వ్ చేస్తూ చట్టం చేసిన మొదటి రాష్ట్రం ఏది?

A) కేరళ
B) హిమాచల్ ప్రదేశ్
C) పశ్చిమ బెంగాల్
D) తమిళనాడు

సమాధానం:

 B) హిమాచల్ ప్రదేశ్ వివరణ: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఈ చట్టాన్ని ఆమోదించింది. దీనివల్ల రాష్ట్రంలోని పంచాయతీలలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. గతంలో 33% రిజర్వేషన్ ఉండేది.


2. కేంద్ర ప్రభుత్వ అనుపాలన మరియు నియంత్రణ సంస్కరణల (Compliance Reduction & Regulation) కింద 51 ప్రాథమిక సంస్కరణలను పూర్తి చేసిన దేశంలోనే మొదటి రాష్ట్రం ఏది?

A) త్రిపుర
B) సిక్కిం
C) గోవా
D) కేరళ

సమాధానం:

 A) త్రిపుర ,వివరణ: ప్రభుత్వ పాలనలో సరళీకరణ మరియు సంస్కరణలను పూర్తి చేయడంలో త్రిపుర ప్రథమ స్థానంలో నిలిచింది.


3. మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాల – కమల్ మౌలా మసీదు సముదాయాన్ని హైకోర్టు ఏమిటిగా ప్రకటించింది?

A) మసీదు
B) మందిరం
C) శ్మశానం
D) స్మారక కట్టడం

సమాధానం:

 B) మందిరం, వివరణ: మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న ఈ వివాదాస్పద సముదాయాన్ని మందిరంగా పరిగణించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది.


4. విద్యా సంస్థలలో (స్కూల్స్ మరియు కాలేజీలు) హిజాబ్ ధరించడంపై గతంలో విధించిన నిషేధాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది?

A) మహారాష్ట్ర
B) కర్ణాటక
C) కేరళ
D) తెలంగాణ

సమాధానం:

 B) కర్ణాటక, వివరణ: కర్ణాటక ప్రభుత్వం గతంలో ఉన్న హిజాబ్ నిషేధ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.


📌 రాష్ట్ర పథకాలు & రిజర్వేషన్లు (State Schemes & Reservations)

5. అస్సాం ప్రభుత్వం తన రాష్ట్రంలోని ఏ తెగ వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు ప్రకటించింది?

A) బోడో తెగ
B) టీ (Tea) తెగ
C) మిజింగ్ తెగ
D) కర్బీ తెగ

సమాధానం:

 B) టీ (Tea) తెగ ,వివరణ: టీ గార్డెన్లలో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం అస్సాం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


6. పంటలను జంతువుల నుండి రక్షించడానికి పొలాల చుట్టూ కంచె (Fencing) వేయడం ఏ పథకం యొక్క ఉద్దేశ్యం

A) PM-Kisan
B) ఆశ్రయం (Aashrayam) పథకం
C) సోలార్ ఫెన్సింగ్ పథకం
D) కిసాన్ సంజీవని

సమాధానం: 

B) ఆశ్రయం (Aashrayam) పథకం, వివరణ: పంటలను జంతువుల నుండి రక్షించడానికి పొలాల చుట్టూ కంచె వేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.


📌 సైన్స్ & టెక్నాలజీ (Science & Tech)

7. భారతదేశపు మొట్టమొదటి సమగ్ర కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ (CCUS) ఫీల్డ్ లాబొరేటరీ ఎక్కడ ప్రారంభించబడింది?

A) IIT ఢిల్లీ
B) IIT మద్రాస్
C) IIT బాంబే
D) IIT కాన్పూర్

సమాధానం: 

C) IIT బాంబే, వివరణ: వాతావరణం నుండి CO₂ ను గ్రహించి భూమి లోపల భద్రపరిచే ఈ అత్యాధునిక కేంద్రాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ IIT బాంబేలో ప్రారంభించారు.


8. DMRC మరియు IOCL సంయుక్తంగా భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత షటిల్ బస్ సర్వీసును ఏ మార్గంలో ప్రారంభించాయి?

A) విమానాశ్రయం – రైల్వే స్టేషన్
B) సెంట్రల్ సెక్రటేరియట్ – సేవా తీర్థ
C) ఎర్రకోట – ఇండియా గేట్
D) ద్వారక – నోయిడా

సమాధానం:

 B) సెంట్రల్ సెక్రటేరియట్ – సేవా తీర్థ , వివరణ: కాలుష్య రహిత రవాణా కోసం ఢిల్లీలో ఈ హైడ్రోజన్ బస్సు సేవలను ప్రారంభించారు.


📌 ఆరోగ్యం (Health)

9. అల్జీమర్స్ (Alzheimer’s) వ్యాధి చికిత్స కోసం భారతదేశంలో అనుమతించబడిన డోనానెమాబ్‘ (Donanemab) ఔషధాన్ని ఏ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నారు?

A) అల్జీ-కూర్
B) లార్‌మాల్‌జీ (LorMalji)
C) మెమొరీ-సేఫ్
D) బ్రెయిన్-షీల్డ్

సమాధానం:

 B) లార్‌మాల్‌జీ, వివరణ: అమెరికాకు చెందిన ఎల్లీ లిల్లీ కంపెనీ రూపొందించిన ఈ ఔషధం అల్జీమర్స్ వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది.


📌 అంతర్జాతీయ (International)

10. ఇటీవల యునైటెడ్ కింగ్‌డమ్ (UK) లో భారత హైకమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు?

A) విక్రమ్ మిస్రీ
B) పెరియాసామి కుమరన్ (Periasamy Kumaran)
C) రుచిరా కాంబోజ్
D) తరంజీత్ సింగ్ సంధు

సమాధానం: B) పెరియాసామి కుమరన్

వివరణ: సీనియర్ దౌత్యవేత్త పెరియాసామి కుమరన్ బ్రిటన్లో భారత నూతన రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు.


📌 రాష్ట్ర విధానాలు (State Policies)

11. పాఠశాలల్లో ఉదయం ప్రార్థన సమయంలో వందేమాతరంగీతాన్ని తప్పనిసరి చేస్తూ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది?

A) అస్సాం
B) రాజస్థాన్
C) పశ్చిమ బెంగాల్
D) ఉత్తరప్రదేశ్

సమాధానం: 

C) పశ్చిమ బెంగాల్, వివరణ: పశ్చిమ బెంగాల్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలో జాతీయ గేయం వందేమాతరం పాడటం ఇకపై తప్పనిసరి.


📌 పరిశ్రమలు (Industry)

12. రాజస్థాన్‌లోని మొట్టమొదటి సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఎక్కడ ప్రారంభించబడింది?

A) జైపూర్
B) జోధ్‌పూర్
C) భివాడి (Bhiwadi)
D) ఉదయ్‌పూర్

సమాధానం: 

C) భివాడి, వివరణ: రాజస్థాన్‌లో చిప్ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి భివాడిలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.


📌ముఖ్యమైన రోజులు (Important Days)

13. ప్రతి ఏటా మే 16న జరుపుకునే అంతర్జాతీయ దినోత్సవం ఏది?

A) అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం
B) అంతర్జాతీయ కాంతి దినోత్సవం (International Day of Light)
C) ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం
D) ప్రపంచ రక్తపోటు దినోత్సవం

సమాధానం: 

B) అంతర్జాతీయ కాంతి దినోత్సవం, వివరణ: 1960లో థియోడర్ మైమన్ మొదటిసారి లేజర్ కాంతిని విజయవంతంగా ప్రదర్శించిన గుర్తుగా మే 16న దీనిని జరుపుకుంటారు. 2026 థీమ్: ‘స్థిరమైన భవిష్యత్తు కోసం కాంతి’.


📌 వ్యవసాయం (Agriculture)

14. జంతువుల నుండి పంటలను రక్షించే ఆశ్రయంపథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది

A) పంజాబ్
B) హర్యానా
C) మధ్యప్రదేశ్
D) రాజస్థాన్

సమాధానం:

 C) మధ్యప్రదేశ్, వివరణ: పంటలను జంతువుల నుండి రక్షించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘ఆశ్రయం’ పథకాన్ని ప్రారంభించింది.


May 2026 Current Affairs PDF Download


Discover more from SRMTUTORS

Subscribe to get the latest posts sent to your email.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment