Home » Current Affairs Quiz » March 2026 Current Affairs Quiz – Monthly Current Affairs MCQs for All Competitive Exams

March 2026 Current Affairs Quiz – Monthly Current Affairs MCQs for All Competitive Exams

On: మంగళవారం, మార్చి 17, 2026 6:30 సా.
March 2026 Current Affairs Quiz

March 2026 Current Affairs Quiz for APPSC, TSPSC, SSC, Banking, Railway and other competitive exams.

Practice these important MCQs and test your preparation.
You can also attempt our daily current affairs quiz for better practice.

March 2026 Current Affairs Quiz MCQs

436. నారీ శ్రమశక్తి అవార్డుకు సింగరేణి నుంచి ఎవరు ఎంపికయ్యారు?
(A) జి.కిషన్ రెడ్డి
(B) జి.ప్రేమ్ సాగర్ రావు
(C) అల్లం నవ్యశ్రీ
(D) వై.మహేష్

Correct Answer: అల్లం నవ్యశ్రీ

Explanation:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోల్ ఇండియా ఆధ్వర్యంలో అందించే నారీ శ్రమశక్తి అవార్డుకు సింగరేణి జీడీకే-11 గని అధికారిణి అల్లం నవ్యశ్రీ ఎంపికయ్యారు.

437. మహిళలపై జరిగే దాడులను అరికట్టడంలో పురుషులే బాధ్యత తీసుకోవాలనే లక్ష్యంతో 'స్టాండ్ విత్ హర్' కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
(A) తెలంగాణ
(B) మధ్యప్రదేశ్
(C) తమిళనాడు
(D) గుజరాత్

Correct Answer: తెలంగాణ

Explanation:
'మహిళా భద్రత పురుషుల బాధ్యత' అనే సందేశంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించారు.

438. రాష్ట్రపతి కార్యాలయం నుండి ఇటీవల వెలువడిన నోటిఫికేషన్ ప్రకారం, తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా ఎవరు నియమితులయ్యారు?
(A) సి.వి. ఆనంద బోస్
(B) జిష్ణు దేవ్ వర్మ
(C) శివ ప్రతాప్ శుక్లా
(D) సి. పి. రాధ క్రిష్ణ

Correct Answer: శివ ప్రతాప్ శుక్లా

Explanation:
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేస్తున్న శివ్ ప్రతాప్ శుక్లాను తెలంగాణ కొత్త గవర్నర్‌గా నియమించారు. తెలంగాణ గవర్నర్‌గా పదవీ విరమణ చేస్తున్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేశారు.

439. భారతదేశంలో ఏటా జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
(A) మార్చి 5
(B) మార్చి 6
(C) మార్చి 7
(D) మార్చి 8

Correct Answer: మార్చి 6

Explanation:
భారతదేశంలో ఫార్మసీ విద్య పితామహుడిగా పరిగణించబడే ప్రొఫెసర్ మహాదేవ లాల్ ష్రాఫ్ జయంతిని పురస్కరించుకుని మార్చి 6న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

440. ఇటీవలి నివేదికల ప్రకారం, బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లాలని భావిస్తున్న నేత ఎవరు?
(A) తేజస్వి యాదవ్
(B) నితీష్ కుమార్
(C) గిరిరాజ్ సింగ్
(D) చిరాగ్ పాశ్వాన్

Correct Answer: నితీష్ కుమార్

Explanation:
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లాలని యోచిస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

441. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చామతి మరియు జలాంగి నదుల పునరుజ్జీవనం కోసం ఏ దేశానికి చెందిన సంస్థతో ఒప్పందం (MoU) కుదుర్చుకుంది?
(A) జపాన్
(B) ఫ్రాన్స్
(C) జర్మనీ
(D) ఇజ్రాయెల్

Correct Answer: జర్మనీ

Explanation:
జర్మనీకి చెందిన GIZ సంస్థ మరియు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగతో కలిసి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ నదుల అభివృద్ధికి ఒప్పందం చేసుకుంది.

442. అంతరించిపోతున్న 'ఫారెస్ట్ ఓలెట్' (Forest Owlet) అనే పక్షి జాతి 2026లో మొదటిసారి ఏ నేషనల్ పార్క్‌లో కనిపించింది?
(A) జిమ్ కార్బెట్ పార్క్
(B) కాన్హా నేషనల్ పార్క్
(C) కూనో నేషనల్ పార్క్
(D) బందీపూర్ పార్క్

Correct Answer: కూనో నేషనల్ పార్క్

Explanation:
మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్క్‌లో తొలిసారిగా అంతరించిపోతున్న ఫారెస్ట్ ఓలెట్ పక్షిని గుర్తించారు.

443. 'ప్రపంచ సముద్ర గడ్డి దినోత్సవం' (World Sea Grass Day) ప్రతి ఏటా ఏ తేదీన జరుపుకుంటారు?
(A) మార్చి 1
(B) మార్చి 3
(C) మార్చి 5
(D) మార్చి 8

Correct Answer: మార్చి 1

Explanation:
సముద్ర పర్యావరణ వ్యవస్థలో కీలకమైన సముద్ర గడ్డిని సంరక్షించడంపై అవగాహన కోసం మార్చి 1న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

444. మార్చి 2026లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో ప్రారంభించిన నాలుగు మహిళా సంక్షేమ పథకాల్లో లేనిది ఏది?
(A) లఖ్ పతి బిటియా యోజన
(B) మేరీ పూంజీ మేరా అధికార
(C) సహేలి పింక్ స్మార్ట్ కార్డ్
(D) బేటీ బచావో బేటీ పడావో

Correct Answer: బేటీ బచావో బేటీ పడావో

Explanation:
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహేలి పింక్ కార్డ్, లఖ్ పతి బిటియా, మేరీ పూంజీ మేరా అధికార మరియు ఉచిత LPG సిలిండర్ పథకాలను ప్రారంభించారు. బేటీ బచావో బేటీ పడావో పాత పథకం.

445. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని ప్రాంతాల్లోని రైతుల కోసం 'ఆఫ్‌లైన్ ఈ-క్రాప్ రిజిస్ట్రేషన్' సదుపాయాన్ని ఏ రాష్ట్రం కల్పించింది?
(A) ఆంధ్రప్రదేశ్
(B) తెలంగాణ
(C) మహారాష్ట్ర
(D) పంజాబ్

Correct Answer: మహారాష్ట్ర

Explanation:
నెట్‌వర్క్ లేని సమయంలో కూడా పంట వివరాలను నమోదు చేసుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆఫ్‌లైన్ ఈ-క్రాప్ సదుపాయాన్ని తెచ్చింది.

446. ఇటీవల వార్తల్లో నిలిచిన 'కార్బీ ఆంగ్లాంగ్ జింజర్' (అల్లం) ఏ రాష్ట్రానికి చెందింది?
(A) మణిపూర్
(B) మేఘాలయ
(C) అస్సాం
(D) నాగాలాండ్

Correct Answer: అస్సాం

Explanation:
అస్సాంలోని కార్బీ ఆంగ్లాంగ్ ప్రాంతానికి చెందిన అల్లం లండన్‌కు ఎగుమతి చేయబడటంతో వార్తల్లో నిలిచింది. దీనికి GI ట్యాగ్ కూడా ఉంది.

447. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన 'అష్మోలియన్ మ్యూజియం' 16వ శతాబ్దానికి చెందిన ఏ భారతీయ సాధువు విగ్రహాన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించింది?
(A) తిరువల్లువర్
(B) తిరుమంగై ఆళ్వార్
(C) రామానుజాచార్యులు
(D) ఆదిశంకరాచార్యులు

Correct Answer: తిరుమంగై ఆళ్వార్

Explanation:
తమిళనాడులోని ఒక ఆలయానికి చెందిన 16వ శతాబ్దపు కాంస్య విగ్రహాన్ని ఆక్స్‌ఫర్డ్ మ్యూజియం తిరిగి భారత్‌కు అప్పగించనుంది.

448. అంగారక గ్రహం (Mars) ఉపరితలం కింద 'బీచ్' వంటి నిర్మాణాన్ని ఏ రోవర్ కనుగొంది?
(A) పర్సెవరెన్స్
(B) క్యూరియాసిటీ
(C) జురోంగ్ (Zhurong)
(D) సోజర్నర్

Correct Answer: జురోంగ్ (Zhurong)

Explanation:
చైనాకు చెందిన జురోంగ్ రోవర్ అంగారక గ్రహం అడుగున పురాతన బీచ్ వంటి నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించింది.

449. మోజ్తబా హోస్సేనీ ఖమేనీ ఇటీవల ఏ దేశానికి సుప్రీం లీడర్‌గా నియమితులయ్యారు?
(A) ఇరాక్
(B) ఇరాన్
(C) సౌదీ అరేబియా
(D) ఖతార్

Correct Answer: ఇరాన్

Explanation:
తన తండ్రి అలీ ఖమేనీ మరణానంతరం మోజ్తబా ఇరాన్ దేశపు అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు.

450. ఇటీవలే మరణించిన ప్రముఖ పాత్రికేయుడు హెచ్.కె. దువా (H.K. Dua)కు ఏ పౌర పురస్కారం లభించింది?
(A) పద్మశ్రీ
(B) పద్మ భూషణ్
(C) పద్మ విభూషణ్
(D) భారతరత్న

Correct Answer: పద్మ భూషణ్

Explanation:
హెచ్.కె. దువా ప్రసిద్ధ జర్నలిస్ట్ మరియు ఆయనకు 2008లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని అందించింది.

Showing Page 30 of 35 (Total 525 Questions)
« First 1 ... 28 29 30 31 32 ... 35 Last »

Practice Daily Current Affairs Quiz

Practice More Current Affairs

Practice more quizzes from SRMTUTORS to improve your current affairs knowledge for competitive exams.

  • Daily Current Affairs Quiz
  • Weekly Current Affairs Quiz
  • Monthly Current Affairs Quiz


Discover more from SRMTUTORS

Subscribe to get the latest posts sent to your email.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now